ర‌వితేజ‌ను అలా మార్చేస్తున్నారా..?

 


ఎవ‌రేం అనుకున్నా.. రాజా ది గ్రేట్ త‌ర్వాత ర‌వితేజ తీరు మాత్రం మారింది. ఈ చిత్రానికి ముందు భారీ గ్యాప్ తీసుకున్న మాస్ రాజా.. ఇప్పుడు దాన్ని క‌వ‌ర్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని అర్థ‌మైపోతుంది. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తున్న ట‌చ్ చేసి చూడు షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు మ‌రో సినిమాకు కూడా ముహూర్తం ఫిక్స్ చేసాడు ర‌వితేజ‌. జ‌న‌వ‌రి 5న క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌తో ర‌వితేజ చేయ‌బోయే సినిమా ఓపెనింగ్ జ‌ర‌గ‌బోతుంది. రామ్ తుళ్లూరి నిర్మాత‌. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ సంక్రాంతి త‌ర్వాత జ‌ర‌గ‌నుంది. అయితే ఇక్క‌డే చిన్న విచిత్రం ఉంది. ఈ చిత్ర టైటిల్ నేల‌టికెట్ అని వినిపిస్తుంది. అంటే ఇది ప‌క్కా మాస్ సినిమా అని అర్థ‌మైపోతుంది. ఈ చిత్రానికి ఫిదా ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతం అందించ‌నున్నాడు. హీరోయిన్ కోసం వేట సాగుతుంది.
ర‌వితేజతో సినిమా చేయాలంటే క‌చ్చితంగా ఆయ‌న రూట్ లోకి రావాల్సిందే. ఆయ‌న రూట్ మారిస్తే విజ‌యం వ‌రించ‌దు. ఫ్యామిలీ సినిమాలు మాస్ రాజాకు పెద్ద‌గా క‌లిసిరాలేదు. చివ‌రికి రాజ‌మౌళి కూడా అప్ప‌ట్లో విక్ర‌మార్కుడులో కావాల్సినంత కామెడీ పెట్టాడు. ఇక ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ కూడా ర‌వితేజ కోసం త‌నే స్టైల్ మార్చుకుంటున్నాడు. శీనువైట్ల‌తో సినిమా చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు ఆయ‌న ఉన్న ప‌రిస్థితికి ఆయ‌న్ని న‌మ్మ‌డం అంటే కాస్త రిస్కే. అందుకే క‌ష్ట‌మైనా ప‌ర్లేద‌ని పాత స్నేహితున్ని ప‌క్క‌న‌బెట్టి కుర్రాన్ని లైన్ లోకి తీసుకొచ్చాడు ర‌వితేజ‌. నేల టికెట్ అనే ఊర‌మాస్ టైటిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు క‌ళ్యాణ్. సోగ్గాడే చిన్నినాయ‌నా.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాల త‌ర్వాత క‌ళ్యాణ్ నుంచి ఇలాంటి సినిమా ఊహించ‌డం విచిత్ర‌మే. మొత్తానికి తాను ద‌ర్శ‌కుడి దారిలోకి వెళ్ల‌కుండా.. త‌న దారిలోకే ద‌ర్శ‌కున్ని తెచ్చుకున్నాడు మాస్ రాజా. మరి ఈ నేల‌టికెట్ బ్యాచ్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here