ర‌వితేజ ట‌చ్చింగులు అదిరిపోయాయంట‌..!


Touch Chesi Chudu Movie Pre Release Event Photos
తాను జోరు పెంచేస్తే ఎలా ఉంటుందో మ‌రోసారి చూపిస్తున్నాడు ర‌వితేజ. ఆ మ‌ధ్య రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా.. ఆ గ్యాప్ ను ఒకే ఏడాదిలో తీర్చ‌డానికి ఫిక్సైపోయాడు మాస్ రాజా. రాజా ది గ్రేట్ వ‌చ్చి ఆర్నెళ్ళు కాక‌ముందే ఇప్పుడు మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు ర‌వితేజ‌. ఈయ‌న న‌టించిన ట‌చ్ చేసి చూడు సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల కానుంది. విక్ర‌మ్ సిరికొండ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లు. సెన్సార్ టాక్ ప్ర‌కారం ట‌చ్ చేసి చూడు ప‌క్కా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తుంది. ర‌వితేజ స్టైల్ లోనే కామెడీ ఉంటూ యాక్ష‌న్ లో కుమ్మేసాడ‌ని వార్త‌లొస్తున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ ఈ సినిమాకు ప్రాణంగా నిల‌వ‌నుందంటున్నారు సెన్సార్ యూనిట్. అయితే రొటీన్ క‌థ ఉండ‌టం ఈ సినిమాకు మైన‌స్. కానీ ఎంట‌ర్ టైన్మెంట్ విష‌యంలో మాత్రం ట‌చ్ చేసి చూడు అస్స‌లు త‌గ్గ‌లేద‌ని తెలుస్తుంది. న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌మోష‌న్ లోనూ వేగం పెంచేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు.. సాంగ్స్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు ప్రీత‌మ్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్రంతో మ‌రో హిట్ కొట్టి త‌న రేంజ్ ఇంకా త‌గ్గ‌లేద‌ని నిరూపించుకోవాల‌ని చూస్తున్నాడు మాస్ రాజా. మ‌రి చూడాలిక‌.. ఈయ‌న ట‌చ్చింగులు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here