లక్ష్మీస్ వీరగ్రంధం నూతన చిత్ర ప్రారంభోత్సవం

జయం మూవీస్ పతాకం పై ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీస్ వీరగ్రంధం (ఆదర్శ గృహిణి) ఉప శీర్షిక. ఈ చిత్రానికి సమర్పకులు సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి కాగా నిర్మాత జి. విజయకుమార్ గౌడ్. ఈ నూతన చిత్రం ఆదివారం ఉదయం అనేక వివాదాల నడుమ హైదరాబాద్ లోని ఎన్ఠీఆర్ గార్డెన్స్ లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నూతన చిత్రానికి నిర్మాత కేతిరెడ్డి క్లాప్ నిచ్చి ప్రారంభించుకున్నారు. అనంతరం ఈయన మాట్లాడుతూ 14 కోట్ల ప్రియతమ నటుడు, నాయకుడైనటువంటి లెజెండ్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చరిత్రను తెలుపడానికే మా ఈ ప్రయత్నం..

Lakshmi's Veeragandham Movie Launch Photos

రామారావు గారి జీవితం మొదటి అధ్యాయాన్ని దర్శకుడు తేజ మరియు బాలకృష్ణ గారు, చివరి అధ్యాయాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా రూపంలో తెలుపుతుండగా ఆ మహానుభావుడి జీవిత మధ్య అంకం ఈ మా లక్ష్మీస్ వీరగ్రంధం సినిమలో చూపించడం జరుగుతుంది, రాజకీయ కథాంశం తో పాటు ప్రేమ పూరితమైన ఆదర్శ గృహిణి కథాంశమే ఈ చిత్రం యొక్క ముఖ్య అంకం. దర్శకులు రాంగోపాల్ వర్మ, తేజ లు నిర్మిస్తున్న ఎన్ఠీఆర్ జీవిత చరిత్రల కు కావాలసిన మద్దతు ఇస్తాము అంటూ తెలిపిన శ్రీమతి లక్ష్మి పార్వతి గారు మా సినిమాకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఈ సందర్బంగా అడుగుతున్నా…

అన్న గారి ఆదేశం ప్రకారమే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది కనుకనే లక్షి పార్వతి గారు కూడా మద్దతు ఇస్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుందని భావిస్తున్నా…ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా ఏ శక్తి నన్ను ఆపలేదు. సినిమాను మాత్రం పూర్తి చేసి విడుదల చేస్తాము. మాకు ఎన్ఠీఆర్ గారి అభిమానులే తోడుండి నడిపిస్తారు.

వారి అండ దండలు ఎప్పుడూ మాతో ఉంటాయి, ఎన్ఠీఆర్ గారు పబ్లిక్ ప్రాపర్టీ అయన గురుంచి ప్రజలకు నిజానిజాలు తెలిపే బాధ్యత ఎవరికైనా ఉంది, వీరగ్రంధం గారి మొదటి భార్య కుమారులు వెంకట్రావు, అంజనీ కుమార్ లు కూడా మా వెంట ఉన్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి అతి త్వరలో సినిమా ను ప్రేక్షలు ముందుకు తీసుకు వస్తాము, ఈ చిత్రం లో నాలుగు పాటలు ఒక హరికథ ఉంటాయి, ఈ చిత్రం భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదం చేయడం జరుగుతుందని చలన చిత్ర పరిశ్రమలోనే మరపురాని మైలు రాయిగా నిలుస్తుందని దర్శకుడు కేతిరెడ్డి ఆవేశపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు.

ఈ నూతన చిత్రానికి సంగీతం: ప్రీతమ్, కెమెరా: సుధాకర్ రెడ్డి, మూల కథ-స్క్రీన్ ప్లే-ఎడిటింగ్- దర్శకత్వం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. నిర్మాత: జి. విజయకుమార్ గౌడ్