ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి


​డ‌ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన ఈ కార్య‌క్ర‌మంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ హీరోలు, హీరోయిన్లు హాజ‌ర‌య్యి ‘ఆట‌-పాట’ అనే ప్రోగ్రామ్ ద్వారా అద్భుతంగా ఆక‌ట్ట‌కున్నారు.
శివారెడ్డి మిమిక్రీ, హీరోలంద‌రూ క‌లిసి చేసిన డ్యాన్సులు ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ కార్యక్ర‌మాల‌ను తిల‌కించ‌డానికి దాదాపు 4 వేల‌కు పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ప్రేక్ష‌జ‌నంతో థియేట‌ర్ సంద‌డి సంద‌డిగా మారింది. థియేట‌ర్‌లోని అభిమానులు మెగాస్టార్ అని రాసి ఉన్న ప్ల‌కార్డులు, బోర్డులు ప‌ట్ట‌కుని చిరంజీవిపై త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.
అలాగే ఈ కార్యక్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఉప‌న్యాసం ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఇటు ప్రేక్ష‌కుల్ని అటు సినిమాని క‌లుపుతూ, ‘మా’ అసోసియేష‌న్ గురించి చిరంజీవి ఇచ్చిన స్పీచ్ ఈ కార్యక్ర‌మానికి హైలైట్‌గా నిలిచింది. ఇదివ‌ర‌కు వ‌చ్చిన‌పుడు ఎంత స్పంద‌న ఉందో ఇప్పుడూ కూడా డ‌ల్లాస్‌లో ప్రేక్ష‌కుల నుండి అదే స్పంద‌న ఉంద‌ని చిరంజీవి అన్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి కార్యక్ర‌మ నిర్వాహ‌కుల‌కు, కార్యక్ర‌మాన్ని ఘ‌న‌విజ‌యం చేసిన ప్రేక్ష‌కుల‌కు త‌మ ప్ర‌త్యేక‌ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here