ల‌గాయ‌త్తు త‌మ‌న్నానే అంట‌గా..!

Tamannaah Savyasachi
ల‌గాయ‌త్తు త‌మ‌న్నానే అంట‌గా..!నిన్ను రోడ్డుమీద చూసిన‌ట్లు ల‌గ్గాయ‌త్తు.. ఈ పాట‌ను మ‌రిచిపోవ‌డం అంత ఈజీ కాదు. అప్ప‌ట్లో అల్ల‌రి అల్లుడు కోసం కీర‌వాణి కంపోజ్ చేసిన ఈ పాట ర‌చ్చ ర‌చ్చ చేసింది. ర‌మ్య‌కృష్ణ అందాలు.. నాగార్జున డాన్సులు అబ్బో ఆ త‌రం వాళ్ల‌ను ఊపేసింది ఈ ల‌గ్గాయ‌త్తు. ఇప్పుడు ఇదే పాట‌ను ఈ త‌రం వాళ్ల‌కు కూడా అందిస్తున్నాడు నాగ‌చైత‌న్య‌. ఈయ‌న న‌టిస్తున్న స‌వ్య‌సాచిలో ఈ పాట రీమిక్స్ ఉంది.
ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. అయితే చైతూతో చిందేసే ఆ ల‌గ్గాయ‌త్తు ఎవ‌రనే విష‌యంపై ఇన్నాళ్లూ చ‌ర్చ న‌డిచింది. ఇప్పుడు దీనిపై క్లారిటీ వ‌చ్చింది. చైతూకు 100 ప‌ర్సెంట్ ల‌వ్ ఏంటో చెప్పి.. త‌న త‌డాఖా చూపించిన త‌మ‌న్నానే ఆ ల‌గ్గాయ‌త్తు. అవును.. ఈ పాట‌లో అక్కినేని వార‌సుడితో క‌లిసి చిందేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌. హీరోయిన్ గా న‌టిస్తూనే.. మ‌రోవైపు ఐటం సాంగ్స్ లోనూ చిందేస్తుంది మిల్కీబ్యూటీ.
ఈ పాట కోసం భారీ పారితోషికం అందుకుంటుంది త‌మ‌న్నా. హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా వేసిన ఓ సెట్ లో మే చివ‌ర్లో ఈ పాట‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. జులైలో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. చైతూ ల‌గ్గాయ‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here