వంశీ ఏంటి ఇలా అయిపోయాడు..?


వంశీ పైడిప‌ల్లి.. ఈ పేరు త‌లుచుకోగానే నిండైన రూపం ఒక‌టి క‌ళ్ల ముందు వ‌స్తుంది. లావుగా.. నిండు కుండ‌లా ఉండే ద‌ర్శ‌కుడు గుర్తొస్తాడు. కానీ ఈ మ‌ధ్య ఏమైందో తెలియ‌దు కానీ వంశీ పైడిప‌ల్లి పూర్తిగా మారిపోయాడు. ఈయ‌న లుక్స్ చూసి అంతా ఇప్పుడు షాక్ అవుతున్నారు. అస‌లు ఆ ద‌ర్శ‌కుడేనా..
ఈయ‌న అనిపిస్తుంది. ఒక‌ప్పుడు బాగా లావున్న వంశీ.. ఇప్పుడు స‌న్న‌బ‌డ్డాడు. క‌నీసం గుర్తు కూడా ప‌ట్ట‌లేని విధంగా అత‌డిలో మార్పు వ‌చ్చేసింది. తాజాగా మ‌హేశ్ 25వ సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగానే వంశీని చూసి అంతా షాక్ తింటున్నారు. కావాల‌నే బ‌రువు త‌గ్గాడా లేదంటే వంశీకి ఏమైనా అయిపోయిందా అని కంగారు ప‌డుతున్నారు.
ఈ చిత్రంలో ముఖ్య‌పాత్ర‌లో న‌టిం చ‌నున్న అల్ల‌రి న‌రేష్ పుట్టినరోజు వేడుక‌ల‌కు మ‌హేశ్ బాబు హాజ‌ర‌య్యాడు. ఇందులో ద‌ర్శ‌కుడు వంశీని చూసి కంగారు ప‌డుతున్నారు ఫ్యాన్స్. అస‌లేంటి ఈ ద‌ర్శ‌కుడి ఫిజిక్ ఇలా మారిపోయింది. మొహంలో క‌ళ కూడా లేదు అనుకుంటున్నారు. మ‌రి దీనిపై ఈ ద‌ర్శ‌కుడే స‌మాధానం చెబితే బాగుంటుందేమో..? కాస్త లావుగా ఉన్నా ఆ వంశీనే చాలా బాగున్నాడు.. ఇప్పుడు మొహం అంతా పీక్కుపోయి.. పీల‌గా ఉన్న వంశీ పైడిప‌ల్లిని చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. మ‌రి కాస్తైనా కండ ప‌డ‌తాడేమో చూడాలిక ఈ ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here