వాళ్లు చేయ‌లేంది రాజ‌శేఖ‌ర్ కూతురు చేస్తుందా..?


బాలీవుడ్ తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర వార‌సురాళ్లు త‌క్కువ‌. ఇక్క‌డ హీరోల కంటే ముందే వాళ్ల అభిమానులే వార‌సురాళ్ళ క‌ల‌కు అడ్డు ప‌డుతుంటారు. తాము అభిమానించే హీరోల కూతుళ్లు ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి వాళ్లు ఇష్ట‌ప‌డ‌రు. అందుకే ప‌క్క‌నున్న త‌మిళ ఇండ‌స్ట్రీతో పోల్చినా కూడా మ‌న ద‌గ్గ‌ర వార‌సురాళ్లు లేరు. అప్ప‌ట్లో కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా వ‌స్తానంటే అభిమానులు నో చెప్పారు. ఇప్పుడిప్పుడే ట్రెండ్ మారుతుంది. మంచు ల‌క్ష్మి లాంటి వాళ్లు కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నెట్టుకొస్తుంటే.. కొణిదెల వార‌మ్మాయి నిహారిక ఏదో చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.
ఇక ఇప్పుడు మ‌రో వార‌సురాలు కూడా వ‌చ్చింది. ఆమె శివానీ రాజ‌శేఖ‌ర్.. ఈ రాజ‌శేఖర్ పెద్ద కూతురు ఈమె. ఓవైపు డాక్ట‌ర్ గా చ‌దువుకుంటూనే మ‌రోవైపు సినిమాల్లోకి వ‌స్తుంది ఈ భామ‌. ఈమె తొలి సినిమా 2 స్టేట్స్ హైద‌రాబాద్ లో ఓపెనింగ్ జ‌రుపుకుంది.
బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ అయిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అడ‌వి శేష్ ఇందులో హీరో. ఈయ‌న‌కు జోడీగా శివానీ న‌టిస్తుంది. ఈ చిత్ర ఓపెనింగ్ కు రాజ‌మౌళితో పాటు ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులు అంతా వ‌చ్చారు.
త్వ‌ర‌లోనే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. 2 స్టేట్స్ లో మంచి కంటెంట్ తో పాటు హాట్ హాట్ సీన్స్ కూడా బోలెడున్నాయి. అక్క‌డ అర్జున్ క‌పూర్, అలియా భ‌ట్ ఈ సీన్స్ ను బాగానే ర‌క్తి క‌ట్టించారు. చూస్తుంటే తెలుగులో కూడా ఈ సీన్స్ అలాగే ఉంచేలా ఉన్నారు. ఇక్క‌డ వెంక‌ట్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతు న్నాడు. శివానీ కూడా అందాల ఆర‌బోత‌లో పెద్ద‌గా అడ్డేవీ పెట్టుకోలేదు.
త‌న కూతుళ్ల‌ను స్టార్ హీరోయిన్లుగా మార్చ‌డానికి జీవిత ఎత్తులు బాగా వేస్తుంద‌ని తెలుస్తోంది. ఆ మ‌ధ్య శివానీ ఫోటోషూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇది చూస్తుంటే అన్నింటికీ సిద్ధ‌పడే ఇండ‌స్ట్రీకి రావ‌డానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. అయినా జీవిత‌కు తెలియ‌ని ఇండ‌స్ట్రీనా ఇది. గ్లామ‌ర్ షో లేక‌పోతే స్టార్ డాట‌ర్ అయినా..
ఎవ‌రైనా ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే. అందుకే కూతుళ్ల‌కు ఫుల్ గా ఫీడింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతుంది ఈ మాజీ హీరోయిన్. 2 స్టేట్స్ రీమేక్ తో పాటు నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమాలో శివానీ న‌టించ‌బోతుంద‌ని తెలుస్తోంది. దాంతోపాటు త‌మిళ హీరో విష్ణువిశాల్ ఓ సినిమాలోనూ అవ‌కాశం వ‌చ్చింద‌నే టాక్ అయితే వినిపిస్తుంది. మ‌రి శివానీ రాజ‌శేఖ‌ర్ కెరీర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here