విజువ‌ల్ వండ‌ర్ గా బెల్లంకొండ‌-శ్రీ‌వాస్ సాక్ష్యం


“అల్లుడు శీను, జ‌య జాన‌కి నాయ‌క” లాంటి మాస్ సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైన‌మిక్ బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా “సాక్ష్యం”. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. “పంచ‌భూతాలే ఈ జ‌గ‌తికి సాక్ష్యం.. ఖ‌ర్మ సిద్ధాంతం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరంటూ” అద్భుత‌మైన డైలాగ్ తో డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా వాయిస్ ఓవర్ తో విడుదలైన టీజర్ టెక్నికల్ గా మరియు విజువల్ గా కంటెంట్ పరంగా రిచ్ గా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో పాటు ఆస‌క్తి క‌లిగించే స్క్రీన్ ప్లే.. సున్నిత‌మైన కుటుంబ అనుబంధాలు అన్నీ టీజ‌ర్ లో చూపించారు ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్. సాయిమాధ‌వ్ బుర్రా మాట‌లు సాక్ష్యం టీజ‌ర్ కు అద‌న‌పు బ‌లం. సాక్ష్యం ఓ సూప‌ర్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతుంది. ఈ క‌థ‌కు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్ కేటాయించడం జరిగింది. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీతో పాటు గ్రాఫిక్స్ సాక్ష్యంకు ప్రాణం.
షూటింగ్ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూ జెర్సీలోని అద్భుత‌మైన లొకేష‌న్స్ లో “సాక్ష్యం” షూటింగ్ జ‌రుగుతుంది. మా డైరెక్టర్ శ్రీవాస్ మునుపటి చిత్రాలతో పోల్చుకుంటే “సాక్ష్యం” చాలా భిన్నంగా ఉండబోతోంది. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ఆర్థర్ ఏ విల్స‌న్ అద్భుత‌మైన లొకేష‌న్స్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, మీనా, శ‌ర‌త్ కుమార్, ర‌వికిష‌న్ లాంటి స్టార్ యాక్ట‌ర్స్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సినిమా మే లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది” అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here