విజ‌య్ ఉన్నాడు.. స‌మంత‌కు అత‌డే..!

Vijay Deverakonda Mahanati
ఇన్నాళ్లూ మ‌హాన‌టిలో విజ‌య్ దేవ‌రకొండ ఉన్నాడా లేదా అని ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్. ఉన్నాడ‌ని ఓ సారి.. కాదు లేడ‌ని మ‌రోసారి.. అస‌లు ఈ వార్త ఎక్క‌డ్నుంచి వ‌చ్చింద‌ని ఇంకోసారి.. ఇలా ఎన్నెన్నో వినిపించాయి కానీ అత‌డు ఉన్నాడ‌నే క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు. కానీ స‌డ‌న్ గా ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
ఏ మాత్రం చ‌డీ చ‌ప్పుడు లేకుండా మ‌ధురవాణి ప్రియున్ని ప‌రిచ‌యం చేసారు. నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మ‌ధుర‌వాణి అంటూ స్కూట‌ర్ పై ఓ లుక్ ఇచ్చాడు విజ‌య్. సినిమాలో కూడా ఈయ‌న పేరు విజ‌య్.. విజ‌య్ ఆంటోనీ. ఇందులో స‌మంత‌కు జోడీగా న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. హీరోగా ఇంత క్రేజ్ తెచ్చుకున్న త‌ర్వాత కూడా చిన్న పాత్ర చేయ‌డానికి ఒప్పుకోవ‌డం నిజంగా గొప్ప విష‌యం. కానీ దానివెన‌క నాగ్ అశ్విన్ ఉన్నాడు.
ఈ రోజు విజ‌య్ కెరీర్ ఇలా ఉందంటే కార‌ణం అత‌డే. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో అతి ముఖ్య‌మైన పాత్ర‌ను విజ‌య్ తో చేయించాడు నాగ్. ఆ సినిమా త‌ర్వాతే పెళ్లిచూపులు కానీ.. అర్జున్ రెడ్డిలు కానీ వ‌చ్చింది. దాంతో ఆ రుణం ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాడు విజ‌య్. మే 9న మ‌హాన‌టి విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. సినిమాలో మ‌ధురవాణితో ఈ విజ‌య్ ఆంటోనీ రొమాన్స్ ఎలా ఉంటుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here