విశాఖపట్నంలో ఘనంగా పొట్లూరి స్టూడియోస్  “యువర్స్ లవింగ్లీ”  ప్రి రిలీజ్ ఫంక్షన్!!

పొట్లూరి స్టూడియోస్ పతాకంపై.. శ్రీమతి పొట్లూరి కృష్ణకుమారి సమర్పణలో.. యువ ప్రతిభాశాలి ‘జో’ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పృధ్వి పొట్లూరి హీరోగా నటిస్తూ.. నిర్మించిన వినోదాత్మక సందేశభరిత విభిన్న ప్రేమకథాచిత్రం “యువర్స్ లవింగ్లీ”. హీరోగా, నిర్మాతగా పృథ్వి పొట్లూరికిది పరిచయ చిత్రం కాగా.. తన సరసన హీరోయిన్ గా నటించిన సౌమ్యశెట్టికి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం. హీరో కమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్ తో పాటు యూనిట్ సభ్యులంతా దాదాపుగా వైజాగ్ వాసులు కావడంతో.. ఈచిత్రం ప్రి రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైజాగ్ సిరిపురంలోని వుడా చిల్డ్రన్ ఏరీనాలో పసందైన పలు వినోదాత్మక కార్యక్రమాలతో  ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆద్యంతం ఆహుతులను ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్,   శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, మాజీ శాసన సభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, సుందరపు విజయకుమార్ తదితర ప్రముఖులతోపాటు.. సంగీత దర్శకులు కార్తీక్ కొడకండ్ల, ఎడిటర్ వి.ఎస్.నాగిరెడ్డి, కెమెరామెన్ ప్రవీణ్ కాండ్రేగుల తదితర
చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైజాగ్ కు చెందిన వారంతా కలిసి, వైజాగ్ లో చిత్రీకరించిన “యువర్స్ లవింగ్లీ” మంచి విజయం సాధించాలని అతిధులు అభిలషించారు. ఈనెల 13న విడుదలవుతున్న “యువర్స్ లవింగ్లీ” మంచి విజయం సాధిస్తుందని.. వెంటనే మరో చిత్రం ప్రారంభిస్తామని చిత్ర దర్శకులు జో అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిధులతో పాటు..చిత్ర రూపకల్పనలో తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికీ జో పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
“యువర్స్ లవింగ్లీ” వంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ తో హీరోగా, నిర్మాతగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని పృధ్వి పొట్లూరి అన్నారు. టీజర్ కు, ట్రైలర్ కు సోషల్ మీడియాలో వచ్చిన అనూహ్యమైన స్పందన తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని పృథ్వి పేర్కొన్నారు. రెంటినీ సుమారు 53 లక్షల మంది వీక్షించారని ఆయన తెలిపారు. మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్నందుకు సౌమ్యశెట్టి సంతోషం వ్యక్తం చేశారు!!