విశాల్ అక్క‌డ కొట్టాడు.. మ‌రి ఇక్క‌డ‌..?


విశాల్ సినిమాలు త‌మిళనాట బాగానే ఆడుతున్నాయి. కొన్నేళ్లుగా అక్క‌డ ఆయ‌న‌కు గోల్డెన్ టైమ్ న‌డుస్తుంది. ప‌ర్స‌న‌ల్ గా.. ప్రొఫెష‌న‌ల్ గా ఓ రేంజ్ లో దున్నేస్తున్నాడు. ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన ఇరుంబుతిరై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ మ‌ధ్య వ‌చ్చిన సినిమాల‌న్నీ బాగానే ఆడుతున్నాయి.. కానీ కొన్నేళ్లుగా నిఖార్సైన బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం రాలేదు. ఇరుంబుతిరై ఈ లోటు తీర్చేసింది.
స‌మంత హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో అర్జున్ విలన్. పిఎస్ మిత్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో డిజిట‌ల్ మీడియాలో జ‌రిగే మోసాల‌ను చూపించారు. ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది ఈ స‌బ్జెక్ట్ ఇప్పుడు. త‌మిళ‌నాట మ‌హాన‌టి జోరు త‌గ్గ‌డానికి కార‌ణం కూడా ఈ సినిమానే. అయితే ఇప్పుడు ఇదే సినిమా అభిమన్యుడు పేరుతో తెలుగులో విడుద‌ల‌వుతుంది. జూన్ 1న వ‌స్తున్నాడు ఈ అభిమన్యుడు.
విశాల్ సినిమాల‌కు తెలుగులో క్రేజ్ బాగానే ఉంటుంది. మాస్ ఆడియ‌న్స్ ఇప్ప‌టికీ ఈయ‌న సినిమాలు చూస్తుంటారు. కాక‌పోతే సూప‌ర్ హిట్ అని చెప్పుకునే సినిమా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఆ లోటు త‌న‌కు అభిమ‌న్యుడు తీర్చేస్తుంద‌ని చెబుతున్నాడు విశాల్. జూన్ 1న ఈ చిత్రంతో పాటే రాజ్ త‌రుణ్ రాజుగాడు.. నాగార్జున ఆఫీస‌ర్ విడుద‌ల‌కు సిద్ధ‌మైనా కూడా న‌మ్మ‌కంగానే ఉన్నాడు విశాల్. మ‌రి చూడాలిక‌.. త‌మిళ్ లో బాగా గ‌ట్టిగా కొట్టిన విశాల్.. తెలుగులో ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here