విశాల్ బాగా గ‌ట్టిగా కొట్టాడబ్బా..!


విశాల్ కు ఇప్పుడు త‌మిళ‌నాట సినిమా ఇమేజ్ కంటే రియ‌ల్ ఇమేజ్ ఎక్కువ‌ అయిపోయింది. ఆయ‌న ఏం చెబితే అది న‌మ్మేస్తున్నారు జ‌నాలు కూడా. ఆ మ‌ధ్య రాజ‌కీయాల్లోకి కూడా రావాల‌ని చూసినా.. అంతా క‌లిసి ఆయ‌న్ని తొక్కేసారు. అయితే రియ‌ల్ ఇమేజ్ ఎలా ఉన్నా..
హీరోగా మాత్రం కొన్నేళ్ల నుంచి సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు విశాల్. వ‌చ్చిన సినిమాల‌న్నీ బాగానే ఆడుతున్నాయి. కానీ నిఖార్సైన బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం రావ‌డం లేదు. అప్ప‌టికి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయి వెళ్లిపోతున్నాయి కానీ నిల‌బ‌డ్డం లేదు. ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చింది. ఈయ‌న న‌టించిన ఇరుంబుతిరై ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేస్తుంది. తొలి వారంలోనే దాదాపు 30 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది ఇరుంబుతిరై.
స‌మంత హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో అర్జున్ విలన్. పిఎస్ మిత్ర‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో డిజిట‌ల్ మీడియాలో జ‌రిగే మోసాల‌ను చూపించారు. ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది ఈ స‌బ్జెక్ట్ ఇప్పుడు. ఇప్ప‌ట్లో ఏ సినిమాలు కూడా లేక‌పోవ‌డంతో త‌మిళ‌నాట మ‌హాన‌టితో పాటు బాక్సాఫీస్ ను స‌మానంగా షేర్ చేసుకుంటున్నాడు విశాల్. మార్చ్ లోనే రావాల్సిన ఈ చిత్రం స్ట్రైక్ కార‌ణంగా కాస్త ఆల‌స్యంగా వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం ఊహించ‌ని విధంగా రిసీవ్ చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here