విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ టాక్.. క‌న్నుల పండ‌గే..!

వ‌చ్చేసింది.. క‌మ‌ల్ హాసన్ విశ్వ‌రూపం 2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ ట్రైల‌ర్ విడుద‌లైంది. వ‌చ్చీ రావ‌డంతోనే అరాచ‌కం చేస్తున్నాడు లోక‌నాయ‌కుడు. విజువ‌ల్ వండ‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు క‌మ‌ల్. కాక‌పోతే కాస్త ఆల‌స్యంగా వ‌స్తుంది ఈ చిత్రం. ట్రైల‌ర్ చూసాక సినిమాపై ఆస‌క్తి మ‌రింత‌గా పెరిగిపోతుంద‌న‌డంలో ఆతిశ‌యోక్తి లేదు.

2013లో విశ్వ‌రూపం చేసాడు. ఇది వ‌చ్చిన ఆర్నెళ్ల‌కే సీక్వెల్ విడుద‌ల చేయాల‌నుకున్నాడు కానీ కుద‌ర్లేదు. ఇన్నాళ్ల‌కు దీనికి మోక్షం వ‌చ్చింది. మొత్తానికి చెప్పిన‌ట్లుగానే ట్రైల‌ర్ అయితే విడుద‌ల చేసాడు. ఇది బాగానే ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ అయితే అదిరిపోయాయి. ఈ సినిమాకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా క‌మ‌ల్ హాస‌నే. అందుకే ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాడు క‌మ‌ల్. ఇన్ని చుక్క‌లు చూపించినా విశ్వ‌రూపం అంటే క‌మ‌ల్ కు చాలా ఇష్టం. అందుకే విశ్వ‌రూపం 2 కూడా సిద్ధం చేసాడు ఈ హీరో. ఈ సినిమా ఆగ‌స్ట్ 10న రానుంది. తొలి భాగం హిట్ అనిపించుకున్నా.. క‌మ‌ల్ కు మిగిలిందేమీ లేదు. ఈ సినిమాతో న‌ష్టాలే వ‌చ్చాయి ఈ హీరోకి.

దాంతో విశ్వ‌రూపం 2ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ నిర్మించాడు. కానీ మ‌ధ్య‌లోనే ఈ నిర్మాత కూడా చేతులెత్తేసాడు. ఆ త‌ర్వాత అగ‌మ్య‌గోచ‌రంగా మారిన విశ్వ‌రూపం 2ను మ‌ళ్లీ క‌మ‌ల్ ముందుకొచ్చి నెత్తినేసుకున్నాడు. ఫ‌స్ట్ లుక్ లోనే ఇండియ‌న్ జెండా ప‌ట్టుకుని సెంటిమెంట్ తో కొట్టాడు క‌మ‌ల్. గ‌తంలో ముర‌ద‌నాయ‌గం, మ‌ర్మ‌యోగి లాంటి సినిమాల్ని మొద‌లుపెట్టి ఆపేసిన క‌మ‌ల్.. విశ్వ‌రూపం 2కి ఆ గ‌తి రాకూడ‌ద‌ని ఫిక్స‌య్యాడు. అందుకే కాస్త ఆల‌స్య‌మైనా బాక్సుల్లోంచి ఆ సినిమాను బ‌య‌టికి తీసుకొస్తున్నాడు క‌మ‌ల్ హాస‌న్.

 

For Trailer click:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here