వెంకీ-తేజ‌.. మ‌రో సుంద‌ర‌కాండ‌.. 

Venkatesh (1)
అదేంటి.. సుంద‌ర‌కాండ అంటే మ‌ళ్లీ రాఘవేంద్ర‌రావ్ సినిమా చేస్తున్నారా ఏంటి అనుకోవ‌ద్దు. కాక‌పోతే ఈ సారి కొద్దిగా కొత్త‌గా ట్రై చేస్తున్నాడు తేజ‌. వెంక‌టేశ్ తో ఈయ‌న ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఇప్పుడు ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో వెంకీ చాలా కొత్త‌గా ఉన్నాడు. గ‌డ్డంతో నీట్ గా అద్దాలు పెట్టుకుని క‌నిపిస్తున్నాడు వెంక‌టేశ్. ఇక సుంద‌రాకాండ ఎందుకు అంటే ఇందులో వెంక‌టేశ్ లెక్చ‌ర‌ర్ గా న‌టిస్తున్నాడు. చివ‌ర‌గా ఈయ‌న గురుగా న‌టించింది సుంద‌రాకాండ‌లోనే. మ‌ళ్లీ పాతికేళ్ల త‌ర్వాత ఆ పాత్ర‌లో న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. ఈ సినిమాకు ఆట‌నాదే వేట‌నాదే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు.
ఇండ‌స్ట్రీలో ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ ఒక్క హిట్ వ‌స్తే చాలు అన్నీ మ‌రిచిపోతారు. 15 ఏళ్లు విజ‌యం లేని తేజ‌.. ఊహించ‌ని విధంగా నేనే రాజు నేనేమంత్రితో హిట్ కొట్టాడు. మ‌ళ్లీ ఈయ‌న్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు హీరోలు. ఇప్పుడు ఈయ‌న వెంక‌టేశ్ హీరోగా త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుండి హైదరాబాద్ ఓల్డ్ సిటిలోప్రారంభం కానుంది. అనూప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో దాదాపు 60 మంది కొత్తవాళ్లే నటిస్తున్నారు. గురు సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కు తేజ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఓకే అన్నాడు. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here