వెంకీ సినిమాలో సాయిధ‌రంతేజ్..


అస‌లే ఇప్పుడు తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. హీరోలంతా ఇగోలు ప‌క్క‌న‌బెట్టి సింపుల్ గా క‌థ‌లు న‌చ్చితే క‌లిసి న‌టిస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఇప్పుడు సాయిధ‌రంతేజ్ కూడా వెంకీ సినిమాలో న‌టిస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. వెంకీ సినిమాలో తేజూ న‌టించ‌డం మాత్రం నిజ‌మే.. కానీ ఆయ‌న హీరో కాదు.. ద‌ర్శ‌కుడు. అవును..
ఈ ఏడాది ఛ‌లో సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వెంకీ కుడుముల ఐడియా ఉన్నాడు క‌దా.. ఈయ‌న త్వ‌ర‌లోనే సాయిధ‌రంతేజ్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఫ్లాపులు ఉన్నా కూడా సాయి ఇమేజ్ మాత్రం ఏమీ త‌గ్గ‌డం లేదు. ఒక‌టి పూర్త‌య్యే లోపు మ‌రో రెండు మూడు సినిమాలు రెడీగా ఉంటున్నాయి.
ప్ర‌స్తుతం ఈయ‌న క‌రుణాక‌ర‌ణ్ తో తేజ్ ఐ ల‌వ్ యూ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌య్యాక గోపీచంద్ మ‌లినేని సినిమా చేయ‌బోతున్నాడు. ఇది మెడిక‌ల్ మాఫియా చుట్టూ తిరిగే క‌థ‌. ఇక ఇదిలా సెట్స్ పైకి వెళ్ల‌లేదు అప్పుడే వెంకీ కుడుముల సినిమా కూడా ఓకే అయిపోయింది. ఈయ‌న రెండో సినిమా నితిన్ తో చేయ‌బోతున్నాడు. దాని త‌ర్వాత వెంకీ- తేజ్ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here