వైఎస్సార్ గా మ‌మ్ముట్టి.. ఇదిగో సాక్ష్యం.. 

 


వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ముఖ్య‌మంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని అద్భుత‌మైన ప్ర‌గ‌తి వైపు అడుగేసేలా చేసిన జ‌న నాయ‌కుడు. రాజ‌కీయ నాయ‌కుడు అన్న త‌ర్వాత పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. రాజ‌శేఖ‌ర్ రెడ్డిపై కొన్ని విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.. చాలా అలిగేష‌న్స్ ఉన్నాయి కానీ చ‌నిపోయిన వ్య‌క్తి గురించి ఇప్పుడు అవ‌న్నీ మాట్లాడ‌టం స‌రికాదు. ఆయ‌నకు ప్ర‌జ‌ల గుండెల్లో అంతులేని అభిమానం అయితే ఉంది. ఈయ‌న చ‌నిపోయి 9 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న జీవితంపై బ‌యోపిక్ రాలేదు. అప్ప‌ట్లో పూరీ జ‌గ‌న్నాథ్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అనే సినిమా మొద‌లుపెట్టాడు. రాజ‌శేఖ‌ర్ ఇందులో హీరోగా న‌టించాల‌ని ఫిక్స‌య్యాడు. కానీ త‌ర్వాత అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇన్నేళ్ల‌కు వైఎస్ఆర్ బ‌యోపిక్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ సారి మాత్రం క‌న్ఫ‌ర్మ్. ఆనందో బ్ర‌హ్మ లాంటి సినిమాతో న‌వ్వించిన మహి వి రాఘ‌వ వైఎస్ఆర్ బ‌యోపిక్ బాధ్య‌త‌ తీసుకుంటున్నాడు.
హీరో ఎవ‌రో తెలుసా.. మ‌ళ‌యాల మెగాస్టార్  మ‌మ్ముట్టి.  ప్ర‌స్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ఈ క‌థ మ‌మ్ముట్టికి చెప్ప‌డం.. ఆయ‌న మూడు భాష‌ల్లో న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం కూడా జ‌రిగిపోయాయి. వైఎస్ఆర్ బయోపిక్ కు యాత్ర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా మ‌మ్ముట్టిని క‌లిసి పూర్తిస్థాయి స్క్రిప్ట్ వినిపించాడు ద‌ర్శ‌కుడు రాఘ‌వ‌. ఈ స్టిల్ ను కూడా మీడియాకు విడుద‌ల చేసారు. త్వ‌ర‌లోనే రాజశేఖర్ రెడ్డి బ‌యోపిక్ ప‌ట్టాలెక్క‌నుంది. వైఎస్ బ‌యోపిక్ లో పాదయాత్రను హైలైట్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. అది అత‌డి జీవితాన్నే మార్చేసింది. దానికితోడు వైఎస్ఆర్ జీవిత అంతరంగం గురించి ఇందులో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌రి ఇందులో జ‌గ‌న్ గా ఎవ‌రు న‌టిస్తారు.. మిగిలిన పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టించ‌బోతున్నారు.. వైఎస్ బ‌యోపిక్ అంటే చంద్ర‌బాబు పాత్ర‌ను క‌చ్చితంగా పెట్టాల్సిందే. మ‌రి ఆ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌బోతున్నారు..? ఇవ‌న్నీ ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. వైఎస్ఆర్ బ‌యోపిక్ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here