వ‌చ్చాక చెప్తానంటోన్న శేఖ‌ర్ క‌మ్ముల..


ఒక్క సినిమాతో ప‌దేళ్ల ఫ్లాపుల్ని మ‌రిపించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. పైగా ఇండ‌స్ట్రీ కూడా హిట్ కొట్టామా లేదా అనేది చూస్తుంది కానీ ఎప్పుడు కొట్టాం.. ఎన్ని రోజులు ఫ్లాపుల్లో ఉన్నాం అనేది చూడ‌దు. ప‌దేళ్ల త‌ర్వాత ఫిదాతో అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దాంతో ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు ఏం చేస్తున్నాడ‌నే విష‌యంపై ఇండ‌స్ట్రీలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఫిదా ముందు వ‌ర‌కు కూడా ఈయ‌న గురించి పెద్ద‌గా ప‌ట్టించుకున్న వాళ్లు లేరు. కానీ ఇప్పుడు ఈయ‌నేం చేస్తున్నాడో అంద‌రికీ కావాలి. ఆ మ‌ధ్య లీడ‌ర్ 2 చేస్తాన‌న్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌న‌సు మారింది. మ‌రోసారి ఫిదా త‌ర‌హాలోనే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు క‌మ్ముల‌. ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉన్నాడు క‌మ్ముల‌. అక్క‌డే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేస్తున్నాడు. ఇండియా వ‌చ్చిన త‌ర్వాత ఏం చేయాల‌నుకుంటున్నాడు.. ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడు.. ఎవ‌రితో ఈ సినిమా ఉంటుంది అనే విష‌యాల‌పై క్లారిటీ ఇవ్వ‌నున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. అది ఫిదా 2 లా ఉంటుందా.. లేదంటే తెలంగాణ క‌థే మ‌రోసారి చేస్తున్నాడా..? నిర్మాత దిల్ రాజేనా కాదా అనేది త్వ‌ర‌లోనే తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. శేఖ‌ర్ క‌మ్ముల ఏం చేయ‌బోతున్నాడో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here