వ‌రుణ్ తేజ్ తో వెంకీ ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్.. 

Varun Tej
తెలుగులో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఇప్పుడు చాలా గిరాకీ ఉంది. మ‌న హీరోలు ఇగోలు ప‌క్క‌న‌బెట్టి క‌థ న‌చ్చితే అందులోకి దూరిపోతున్నారు. దాంతో ద‌ర్శ‌కులు కూడా మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ల వైపు బాగానే ప‌రుగులు తీస్తున్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇదే చేస్తున్నాడు. అస‌లు ఈ రోజుల్లో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నం అనుకుంటే.. వ‌ర‌స‌గా మూడు విజ‌యాలు అందుకున్నాడు అనిల్ రావిపూడి. అది కూడా ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లతో. ఒక్కో సినిమాలో ఒక్కో క‌థ‌.. కానీ అన్నింట్లోనూ ఎంట‌ర్ టైన్మెంట్ కామ‌న్. ప‌టాస్.. సుప్రీమ్.. రాజా ది గ్రేట్.. ఈ మూడు సినిమాలు చాలు.. అనిల్ రావిపూడి ఏంటో చెప్ప‌డానికి. ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు విజ‌యం రాలేదు కానీ ద‌ర్శ‌కుడిగా మారాక ప‌రాజ‌యం భ‌య‌ప‌డుతుంది మ‌నోడిని చేర‌డానికి. రాజా ది గ్రేట్ త‌ర్వాత అనిల్ రేంజ్ పెరిగిపోయింది.
మ‌నోడు ఓకే అనాలే కానీ స్టార్స్ కూడా సై అంటున్నారు ఈ ద‌ర్శ‌కుడితో ప‌ని చేయ‌డానికి. అయితే ఒకేసారి స్టార్స్ ను ప‌ట్టేసి స్టార్ డైరెక్ట‌ర్ అయిపోవాల‌నే ఆలోచ‌న ఈ కుర్రాడికి లేన‌ట్లుంది. అందుకే ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడు. దీనికి ఎఫ్ 2 అనే విచిత్ర‌మైన టైటిల్ కూడా పెట్టాడు. అంటే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అన్న‌మాట‌. ఇందులో ఒక హీరో మాత్రం వెంక‌టేశ్ అని చాలా రోజుల కిందే వార్త‌లు వ‌చ్చాయి. ఇక మ‌రో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. వ‌రుణ్ కు తొలి హిట్ ఇచ్చింది దిల్ రాజే. ఫిదాతో ఆయ‌న కెరీర్ ను మార్చేసాడు. ఆయ‌న అడిగితే వ‌రుణ్ తేజ్ కాద‌నే స‌మ‌స్యే ఉండ‌దు. ఎలా చూసుకున్నా కూడా అనిల్ రావిపూడి చేయ‌బోతున్న ఆ మ‌ల్టీస్టార‌ర్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక దాంతోపాటు బాల‌య్య‌తో ఓ సినిమా చేస్తాడ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి చూడాలిక‌.. ఈ కుర్రాడి భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here