వ‌రుణ్ తో నాకు పోటీ ఏంట‌న్న సాయి.. 

Varun Tej Tholiprema Vs Sai Dharam Tej Inttelligent
మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు కుర్ర హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఓ వైపు సాయిధరంతేజ్.. మ‌రోవైపు వ‌రుణ్ తేజ్.. ఈ ఇద్ద‌రి సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో వ‌స్తున్నాయి. దాంతో ఈ పోటీపై ఇండ‌స్ట్రీలో చాలా వార్త‌లే వినిపిస్తున్నాయి. దానిపై సాయి స్పందించాడు. అస‌లు వ‌రుణ్ తేజ్ తో నాకు పోటీ ఏంటి.. అస‌లు మా ఇద్ద‌రికి పోటీ అనే మాటే తీసేయండి.. వాడు నాకు చిన్న‌ప్ప‌ట్నుంచీ తెలుసు.. నేను ఎత్తుకుని పెంచాను వాన్ని.. అలాంటి వాడితో నాకు పోటీ ఉండ‌దు.. ఉండ‌బోద‌ని తేల్చేసాడు మెగా మేన‌ల్లుడు. క‌చ్చితంగా త‌న సినిమాతో పాటు వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని చెప్పాడు సాయిధ‌రంతేజ్. అస‌లు మెగా ఫ్యాన్స్ ఓ రికార్డ్ మిస్ అయిపోయార‌ని.. ఒకేరోజు వ‌చ్చి ఇద్ద‌రు మెగా హీరోలు బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టుంటే అది చ‌రిత్ర‌లో నిలిచిపోయేద‌ని చెప్పాడు సాయి. కానీ ఏం చేస్తాం.. రికార్డ్ మిస్ అయిపోయింద‌ని బాధ ప‌డ్డాడు మెగా మేన‌ల్లుడు. చూస్తుంటే వ‌రుణ్ తేజ్ తో పోటీ అనేది పోటీ మాదిరి చూడ‌ట్లేదు సాయి. త‌న మాట‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం అర్థ‌మై పోతుంది. ఇక వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ‌తో పాటు గాయ‌త్రి సినిమాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు సాయిధ‌రంతేజ్. మ‌రి చూడాలి.. ఫిబ్ర‌వ‌రి 9, 10న వ‌స్తోన్న ఈ మూడు సినిమాల భవిష్య‌త్తు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here