వ‌ర్మ‌కు సారీ చెప్పిన అర్జున్ రెడ్డి.. 


అదేంటో తెలియ‌దు కానీ ఇప్పుడు వ‌ర్మ‌కు తెలుగు ఇండ‌స్ట్రీపై ఎక్క‌డ‌లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈయ‌న నాగార్జున‌తో చేస్తోన్న ఆఫీస‌ర్ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది ఈ చిత్రం. మే 25న సినిమా విడుద‌ల కానుంది. అప్పుడే మ‌రో సినిమా కోసం క‌థ సిద్ధం చేసుకుంటున్నాడు వ‌ర్మ‌. హీరోను కూడా ఎంచుకున్నాడు. వ‌ర్మ అడిగిన త‌ర్వాత ఏ హీరో అయినా కాదంటాడా.. అస‌లు ఈయ‌న స్టార్ హీరోల జోలికి వెళ్ల‌డు క‌దా.. అంతా చిన్న హీరోలే కాబ‌ట్టి నో అనే ఛాన్స్ ఉండదు అనుకుంటారంతా. కానీ ఇప్పుడు వ‌ర్మ ఇచ్చిన ఆఫ‌ర్ ను ఓ హీరో కాద‌న్నాడు. సున్నితంగా నేను చేయ‌లేను స‌ర్.. వ‌దిలేయండి అంటూ చేతులు దులిపేసుకున్నాడు. ఆయ‌నే విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అవును.. అర్జున్ రెడ్డి విడుద‌లైన క్ష‌ణం నుంచి విజ‌య్ కు ఫ్యాన్ అయిపోయాడు వ‌ర్మ‌.
అదేంటో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో సినిమాకు ఫ్రీ ప‌బ్లిసిటీ చేసాడు. అర్జున్ రెడ్డి టీం కూడా వ‌ర్మ‌కు చాలా సార్లు థ్యాంక్స్ చెప్పారు. ఇక అదే టైమ్ లో విజ‌య్ తో తాను ఓ సినిమా చేస్తాన‌ని చెప్పాడు వ‌ర్మ‌. అప్పుడు విజ‌య్ కూడా నో అన‌లేక ఓకే స‌ర్ అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈయ‌న ఉన్న బిజీకి వ‌ర్మ‌తో సినిమా అంటే క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దానికితోడు వ‌ర్మ‌తో సినిమా అంటే ఎలా ఉంటుందో తెలియ‌ని ప్ర‌యాణం. అందుకే కెరీర్ గాడిన ప‌డుతున్న ఈ స‌మ‌యంలో వ‌ర్మ‌తో సినిమా అంటూ బాలీవుడ్ కు వెళ్లి ఇప్ప‌టికిప్పుడు పొడిచేదేమీ లేద‌ని ఫీల్ అవుతున్నాడు విజ‌య్. గ‌తంలో నితిన్ లాంటి హీరోల‌ను బాలీవుడ్ కు తీసుకెళ్లి ఎటూ కాకుండా చేసాడు వ‌ర్మ‌. దాంతో ముందు జాగ్ర‌త్త‌గా ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రి చూడాలిక‌.. విజ‌య్ ను వ‌ర్మ ఎలా ఒప్పిస్తాడో.. అస‌లు ఒప్పిస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here