వ‌ర్మ ఏంటి మాకీ ఖ‌ర్మా..?


రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈ పేరులోనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ ఉంది. సంచ‌ల‌నం ఉన్న‌చోటికి ఈయ‌న వెళ్తాడో.. లేదంటే ఈయ‌న వెళ్లిన చోటే సంచ‌ల‌నం అవుతుందో తెలియ‌దు కానీ ప్ర‌తీ విష‌యంలోనూ నేనున్నానంటూ దూరిపోతుంటాడు ఈయ‌న‌. ఇప్పుడు కూడా శ్రీ‌రెడ్డి, ప‌వ‌న్ మ‌ధ్య ఇష్యూలో వ‌ర్మ దూరి ర‌చ్చ ర‌చ్చ చేసాడు.
ఈయ‌న చేసిన పెంట‌తో ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తం క‌దిలిపోయింది. పైగా శ్రీ‌రెడ్డితో తానే ప‌వ‌న్ ను తిట్టించాన‌ని చెప్పి ఇంకా ర‌చ్చ పెంచేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో అల్లు అర‌వింద్ రావ‌డం.. ఆయ‌న చివాట్లు పెట్ట‌డం.. దానికి వ‌ర్మ సారీ చెప్ప‌డం.. వెంట‌నే మ‌ళ్లీ అల్లు అర‌వింద్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో సైటైర్లు వేయ‌డం అన్నీ చేస్తున్నాడు వ‌ర్మ‌.
20 రోజులుగా ఓ అమ్మాయి త‌నకు జ‌రిగిన‌ అన్యాయాన్ని చెప్పుకుంటుంటే ప‌ట్టించుకోని అర‌వింద్ గారు.. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యం అన‌గానే వ‌చ్చేసారా అంటూ సెటైర్ వేసాడు వ‌ర్మ‌. దాంతో పాటు ఇంకా చాలా విష‌యాల్లోనూ ఇప్ప‌టికీ ప‌వ‌న్ అండ్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఈ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.
దానివ‌ల్ల ఆయ‌న‌కు వ‌చ్చేదేంటో తెలియ‌దు కానీ ఇప్పుడు వ‌ర్మ చేసిన ప‌నివ‌ల్ల ఆయ‌న తెలుగు ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి కూడా ఇప్పుడు తెలుగులో ఎవ‌రూ సిద్ధంగా క‌నిపించ‌ట్లేదు. అవ‌స‌రం అనుకుంటే అఖిల్ తో నాగార్జున చేయించాల‌నుకున్న సినిమా కూడా ఆపించేలా ఉన్నాడు. మొత్తానికి వ‌ర్మ ఇప్పుడు తాను తీసుకున్న గోతిలో తానే ప‌డ్డ‌ట్ల‌యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here