శీనువైట్ల‌కు ఇప్పుడు న‌ర‌క‌మే..!


మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ‌టం అంటారు క‌దా.. ఇప్పుడు తాటిపండు కాదు.. ఏకంగా తాటిచెట్టే వ‌చ్చి ప‌డితే ఎలా ఉంటుంది..? ఇప్పుడు శీనువైట్ల‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయ‌న‌కే వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్లు ఉన్నాయి. ఇప్పుడు కానీ ఈయ‌న‌కు హిట్ ప‌డ‌క‌పోతే ఇండ‌స్ట్రీలో శీనువైట్ల అనే పేరు చ‌రిత్ర‌లో క‌లిసిపోతుంది. అస‌లే ఏడాది పాటు వేచి చూసి చూసి ర‌వితేజ‌ను ఒప్పించాడు వైట్ల‌.
అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ అంటూ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రం ఒప్పుకున్న‌పుడు ర‌వితేజ హిట్ జోష్ లో ఉన్నాడు. రాజా ది గ్రేట్ ఆడ‌టంతో శీనువైట్ల‌కు మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయేమో హిట్ కొడితే.. ఎలాగూ ర‌వితేజ ఇమేజ్ ఉండ‌నే ఉంది క‌దా అనుకున్నారు. పైగా నీకోసం.. వెంకీ.. దుబాయ్ శీను లాంటి సినిమాల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కాబ‌ట్టి క‌చ్చితంగా వైట్ల‌కు మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే అని అంతా ఫిక్సైపోయారు. కానీ సీన్ అంతా రివ‌ర్స్ అయిపోయిందిప్పుడు. రాజా ది గ్రేట్ త‌ర్వాత ట‌చ్ చేసి చూడు అంటూ డిజాస్ట‌ర్ ఇచ్చాడు ర‌వితేజ‌..
ఇక ఇప్పుడు వ‌చ్చిన నేల‌టికెట్ అయితే క‌నీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక‌పోతుంది. దాంతో ఇప్పుడు శీనువైట్ల‌కు టెన్ష‌న్ మొద‌లైంది. త‌న సినిమా ఎక్స్ ట్రార్డిన‌రీ అంటే త‌ప్ప ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా రావు. పైగా రొటీన్ క‌థ‌తో వ‌స్తే మాత్రం క‌చ్చితంగా దెబ్బ త‌ప్ప‌దు. అందుకే ఇప్పుడు అస‌లు ఆట ర‌వితేజ కంటే శీనువైట్ల‌కే ఎక్కువ‌. అమెరికా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. ర‌వితేజ‌తో క‌లిసి శీనువైట్ల ఏ మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here