శీనువైట్ల‌కు మ‌ళ్లీ హ్యాండేనా..?

ఒక‌ప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడు.. ఇప్పుడు శీనువైట్ల‌ను చూసి ఇండ‌స్ట్రీలో చాలా మంది అనుకుంటున్న మాట ఇది. వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చేస‌రికి శీనువైట్ల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో ఏ హీరో లేడిప్పుడు. పైగా ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా శీనువైట్ల అంటే ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏదో చేస్తాడులే.. మిస్ట‌ర్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో త‌న పాత స్నేహితుడు ర‌వితేజ‌ను ఆశ్ర‌యించాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నం కూడా ప‌క్క‌కు వెళ్లిపోయింది.
ఈ మ‌ధ్యే ఓ క‌థ సిద్ధం చేసి.. మాస్ రాజాను ఒప్పించాడు వైట్ల‌. బండ్ల గ‌ణేష్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ప‌క్క‌న‌బెట్టాడు ర‌వితేజ‌. ముందు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించాల‌నుకుంది. అయితే వైట్ల‌తో పాటు ర‌వితేజ కూడా ఈ చిత్రాన్ని ఫ్రీగా చేయాల‌నేది వాళ్ల కండీష‌న్. సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్తి చేసి.. విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో షేర్ తీసుకోవాల‌ని చూస్తున్నారు శీనువైట్ల‌.. ర‌వితేజ‌. కానీ అది కుద‌ర్లేదు. ఆ త‌ర్వాత బండ్ల సీన్ లోకి వ‌చ్చాడు. కానీ ఇప్పుడు శీనువైట్ల సినిమాను కాద‌ని.. క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల సినిమాను ఓకే చేసాడు ర‌వితేజ‌. అంటే ఇప్పుడు శీనువైట్ల‌ను పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టిన‌ట్లు అనుకోవాలా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here