శృతి.. ఎనీ టైమ్.. గెట్ రెడీ ఫ‌ర్ ప‌ప్ప‌న్నం..

ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. తండ్రితో స‌హా వ‌చ్చి ఈ మ‌ధ్యే ఓ పెళ్లిలో త‌న పెళ్లి క‌న్ఫ‌ర్మ్ చేసింది శృతిహాస‌న్. ఈ మ‌ధ్యే త‌మిళ న‌టుడు ఆధ్వ‌న్ పెళ్లికి వ‌చ్చిన శృతిహాస‌న్.. ప‌నిలో ప‌నిగా అదే పెళ్లిలో త‌న పెళ్లికి సంబంధించిన హింట్లు కూడా ఇచ్చేసింది. ఈ పెళ్లికి ప్రియుడు మైఖెల్ కోర్సెల్.. తండ్రి క‌మ‌ల్ హాస‌న్ తో క‌లిసి వ‌చ్చింది శృతి. అంతేకాదు.. మైఖెల్ అచ్చంగా త‌మిళ స్టైల్ లో పంచె క‌ట్టుకుని.. బొట్టు పెట్టుకుని వ‌చ్చాడు. క‌మ‌ల్ ప‌క్క‌నే కూర్చున్నాడు. ఇదంతా చూస్తుంటే త్వ‌ర‌లోనే శృతి కూడా ప‌ప్ప‌న్నం పెట్టేలా ఖాయ‌మైపోయింది. దీనికి త‌ల్లిదండ్రుల నుంచి కూడా అనుమతి వ‌చ్చేసింది.


పెళ్లిపై మోజో.. లేదంటే సినిమాల‌పై మోజు త‌గ్గిందో తెలియ‌దు కానీ ఇప్పుడు కెరీర్ ను పూర్తిగా వ‌దిలేసింది శృతిహాస‌న్. దాంతో పాటు ఫిజిక్ మీద దృష్టి పెట్ట‌డ‌మే మానేసింది. కాట‌మ‌రాయుడులో శృతి అప్పియ‌రెన్స్ పై చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. క‌థ‌లు న‌చ్చ‌ట్లేద‌ని చెబుతుంది కానీ తెర‌ వెన‌క మ‌రో కార‌ణం కూడా ఉంది. పెళ్లి చేసుకుని లండ‌న్ లోనే సెటిల్ అయిపోవాల‌నేది శృతిహాస‌న్ కోరిక‌గా క‌నిపిస్తుంది. అక్క‌డే ఓ మ్యూజిక్ ట్రూప్ స్టార్ట్ చేసి దానిపైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. సినిమాల్లోకి రాక‌ముందే ఈమెకు సంగీతంపై ప‌ట్టుంది. క‌మ‌ల్ న‌టించిన ఈనాడు లాంటి సినిమాల‌కు మ్యూజిక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ప్రైవేట్ ఆల్బ‌మ్స్ చేయాల‌ని చూస్తుంది శృతి. దానికోస‌మే కాన్సెప్ట్ సిద్ధం చేసుకుంటుంది. ఇవి స‌క్సెస్ అయితే సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పి రాక్ స్టార్ గా సెటిలైపోవాల‌ని చూస్తుంది. అందుకే కొత్త వాటికి ఓకే చెప్ప‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here