శౌర్య‌పై క్లారిటీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి..


సాయిప‌ల్ల‌వి అంటే ఇప్పుడు ఓ బ్రాండ్. ఆమె బొమ్మ చూసి సినిమాల‌కు క‌లెక్ష‌న్లు వ‌చ్చేస్తున్నాయి. ఫిదా సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఎంసిఏ కూడా రొటీన్ క‌థే అయినా కూడా నానికోసం ఎంత‌మంది వ‌చ్చారో.. సాయిప‌ల్ల‌వి కోసం అంతే మంది వ‌చ్చారు. ఈ ఇద్ద‌రూ క‌లిస్తేనే సినిమా సూప‌ర్ హిట్ అయింది.
ఇక ఇప్పుడు క‌ణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది సాయిప‌ల్ల‌వి. ఈమెకు క్రేజ్ ఎంత వ‌చ్చిందో.. విమ‌ర్శ‌లు కూడా అన్నే వ‌చ్చాయి. గొడ‌వ‌ల్లో ప‌ల్ల‌వి పేరు బాగా వినిపిస్తుంది. ప్ర‌తీసారి సెట్ కు ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని.. ఆటిట్యూడ్ చూపిస్తుంద‌ని చాలా మంది క‌మెంట్ చేసారు సాయిప‌ల్ల‌విపై. ఇక నాగ‌శౌర్య అయితే ఓపెన్ గానే సాయిప‌ల్ల‌విపై విమ‌ర్శ‌లు చేసాడు. దాంతో ప‌ల్లవి ఇప్పుడు ఆ ఇష్యూపై నోరు విప్పింది.
తాను నాగశౌర్య చేసిన క‌మెంట్స్ చూసి షాక్ అయ్యాన‌ని.. వెంట‌నే త‌న‌కు ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి రాలేదని చెప్పింది. నాగ‌శౌర్య చాలా మంచి న‌టుడని.. సెట్ లో కూడా చాలా కామ్‌గా ఉంటాడని త‌న‌ను ఎందుకు ఇలా అర్థం చేసుకున్నాడో అర్థం కాలేద‌ని చెప్పింది ప‌ల్ల‌వి. త‌న‌కు ప‌ని త‌ప్ప మ‌రో ధ్యాసే ఉండ‌ద‌ని.. సెట్ లోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌ర్శ‌కున్ని త‌న పాత్ర గురించి ఒక‌టికి ప‌దిసార్లు అడుగుతాన‌ని అందుకే శౌర్య త‌న గురించి అలా అనుకున్నాడేమో అర్థం కాలేద‌ని చెప్పంది సాయిప‌ల్ల‌వి. మొత్తానికి త‌న‌కు ఒక్క శౌర్య‌తోనే కాదు.. ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here