శ్రీ‌దేవి అంత్య‌క్రియ‌ల‌కు చెల్లి ఎందుకు రాలేదు..?

శ్రీ‌దేవి చ‌నిపోయి 15 రోజులు గ‌డిచినా.. ఇప్ప‌టికీ ఆమె మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు అభిమానులు. మార్చ్ 8న హ‌రిద్వార్ లోని గంగాన‌దిలో ఆమె అస్థిక‌ల‌ను కూడా నిమ‌జ్జ‌నం చేసారు బోనీక‌పూర్. శ్రీ‌దేవి మ‌ర‌ణించిన‌పుడు ఆమెను చూడ్డానికి దేశం న‌లుమూల‌ల నుంచి అభిమానుల‌తో పాటు శ్రేయోభిలాషులు.. బంధువులు వ‌చ్చారు కానీ ఆమె కుటుంబీకులు మాత్రం ఎవ‌రూ క‌నిపించ‌లేదు. ముఖ్యంగా ఆమె చెల్లి శ్రీ‌ల‌త ఎక్క‌డా శ్రీ‌దేవి భౌతిక కాయం ద‌గ్గ‌ర క‌నిపించ‌లేదు స‌రిక‌దా రాలేదు కూడా. చివ‌రి చూపుల‌కు కూడా చూడ‌లేంత త‌ప్పు శ్రీ‌దేవి ఏం చేసింది..? శ్రీ‌లత విష‌యంలో శ్రీ‌దేవి ఎప్పుడూ ప్రేమ‌గానే ఉన్నా.. అక్క‌పై చెల్లి మాత్రం ఎప్పుడూ ప్రేమ చూపించ‌లేదంటారు తెలిసిన‌వాళ్లు.
అంతేకాదు.. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత శ్రీ‌దేవి త‌ల్లికి ఓ జ‌బ్బు వ‌చ్చింద‌ని.. ఆమెను కాపాడుకోడానికి అమెరికా తీసుకెళ్తే అక్క‌డ హాస్పిట‌ల్ ఏదో తేడా చేసింద‌ని.. అప్పుడు ఆమె జీవితంలో భుజం త‌ట్ట‌డానికి వెన్నంట ఉండ‌టానికి ఒక్క బోనీక‌పూర్ త‌ప్ప ఎవ‌రూ క‌నిపించ‌లేదు. అందుకే ఆయ‌నకు చేరువైంది శ్రీ‌దేవి అంటూ చాలా హృద్యంగా ఈ మ‌ధ్యే త‌న లేఖ‌లో రాసాడు వ‌ర్మ‌. ఇక త‌ల్లి చ‌నిపోయే ముందు త‌న ఆస్తి మొత్తం శ్రీ‌దేవి పేరు మీద రాస్తే.. శ్రీ‌దేవి చెల్లి శ్రీ‌ల‌త కోర్ట్ కు వెళ్లి త‌న త‌ల్లి మ‌తిస్థిమితం లేన‌పుడు అక్క ఆస్తి రాయించుకుంద‌ని కేస్ వేసింది. అప్ప‌టికే ఆమె ప‌క్కింటి అత‌డితో వెళ్లిపోయింది. ఇదంతా తెలిసినా కూడా శ్రీ‌దేవి ఏం అనలేని ప‌రిస్థితుల్లో ఉంది.
ఆమె ఆస్తిని అక్ర‌మంగా చెల్లి అనుభ‌విస్తున్నా కూడా ఏరోజు కూడా బాధ ప‌డ‌లేదు.. బ‌య‌ట‌ప‌డ‌లేదు. ముంబైకి వెళ్లిన త‌ర్వాత పూర్తిగా త‌న ఆస్తుల‌ను చెల్లికే వ‌దిలేసింది శ్రీ‌దేవి. ఇప్ప‌టికీ చెన్నైలో ఆమె కొన్న బంగ్లాలో శ్రీ‌ల‌తే ఉంటుంద‌ని చెబుతున్నారు తెలిసిన వాళ్లు. అయినా కూడా ఏ రోజు కూడా శ్రీ‌దేవి అడ‌గలేదు. పైగా శ్రీ‌లత భ‌ర్త స‌తీష్ చాలా తెలివిగా శ్రీ‌దేవి ఆస్తుల‌ను త‌న భార్య పేరు మీద‌కు మార్చుకున్నాడ‌నే ప్ర‌చారం కూడా ఉంది. మ‌రోవైపు శ్రీ‌దేవి ఆస్తుల‌ను కాజేసినా కూడా ఆ త‌ప్పు త‌మ‌వైపు రాకుండా.. బోనీక‌పూర్ ను ఈ విష‌యంలో దోషిని చేసే ప‌న్నాగం ప‌న్నుతున్నారంటూ శ్రీ‌ల‌త‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు బోనీ బంధువులు. ఇదంతా ఇలా ఉంటే.. మార్చ్ 8న బోనీ శ్రీ‌దేవి అస్థిక‌ల‌ను గంగ‌లో క‌లిపితే.. దానికి నాలుగు రోజుల ముందే రామేశ్వ‌రంలో శ్రీ‌దేవికి సంబంధించిన పూజ‌లు చేయించింది శ్రీ‌ల‌త‌. మొత్తానికి శ్రీ‌దేవి చ‌నిపోయినా కూడా ఈ ఫ్యామిలీ డ్రామాకు మాత్రం ఎండ్ కార్డ్ ప‌డ‌టం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here