శ్రీ‌దేవి ఇంట శుభకార్యం..


శ్రీ‌దేవి కుటుంబం అంతా ఇప్పుడు విషాదంలోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆమె లేద‌నే విష‌యాన్ని మ‌రిచిపోవ‌డానికి ట్రై చేస్తున్నారు శ్రీ‌దేవి కుటుంబ స‌భ్యులు. అప్పుడే శ్రీ‌దేవి చ‌నిపోయి నెల రోజులు గ‌డిచింది. ఫిబ్ర‌వ‌రి 24న ఈమె క‌న్నుమూసింది.
చావు ఇంట్లో శుభ‌కార్యం చేస్తే అంద‌రికీ మంచిది అంటారు. అందుకే ఇప్పుడు అదే చేయ‌బోతున్నారు. శ్రీ‌దేవి కుటుంబంలో ఓ పెళ్లి జ‌ర‌గ‌బోతుంది త్వ‌ర‌లోనే. శ్రీ‌దేవి మ‌రిది కూతురు.. అంటే అనిల్ క‌పూర్ కూతురు సోన‌మ్ క‌పూర్ త్వ‌ర‌లోనే పెళ్లికూతురు కాబోతుంది. నాలుగేళ్లుగా ఈ భామ బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజాతో రిలేష‌న్ లో ఉంది. వీళ్లిద్దరి బంధానికి ఇరు కుటుంబాలు కూడా ఓకే అన్నాయి. దాంతో త్వ‌ర‌లోనే ఒక్క‌టి కాబోతున్నారు ఈ జంట‌.
ఒక‌ప్పుడు బాలీవుడ్ లో ప్రేమ అంటే పెళ్లి వ‌ర‌కు గ్యారెంటీ లేని య‌వ్వారం. కానీ ఈ మ‌ధ్య అలా కాదు. ప్రేమిస్తే క‌చ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నారు. సోన‌మ్ క‌పూర్ కూడా ఇప్పుడు ఇదే చేస్తుంది. ఈ మ‌ధ్యే అసిన్.. శ్రీ‌య‌.. అనుష్క శ‌ర్మ‌.. ప్రియ‌మ‌ణి.. ఇలా ఒక్కొక్క‌రుగా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు సోన‌మ్ క‌పూర్ కూడా వీళ్ళ జాబితాలోకి వ‌చ్చేసింది.
మే 11.. 12 తేదీల్లో సోన‌మ్ క‌పూర్ వివాహం ఆనంద్ ఆహూజాతో జ‌ర‌గ‌బోతుంది. బాలీవుడ్ ప్రముఖుల‌తో పాటు బిజినెస్ మెన్.. రాజ‌కీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లి వేడుక‌కు రానున్నారు. మొత్తానికి సోన‌మ్ పెళ్లితో అయినా శ్రీ‌దేవి మ‌ర‌ణాన్ని వాళ్లు మ‌రిచిపోవాల‌ని కోరుకుందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here