శ్రీ‌రెడ్డి విష‌యంలో ఎందుకీ మౌనం..? 

 
ఎవ‌రైనా వ‌చ్చి ఇండ‌స్ట్రీని ఒక్క మాటంటేనే అంత ఎత్తున ఎగిరిప‌డుతుంటారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు.. హీరోలు. అలాంటిది కొన్ని రోజులుగా శ్రీ‌రెడ్డి ఇండ‌స్ట్రీ భాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తుంది. ఎంత‌లా అంటే త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో కూడా తెలియ‌నంత‌గా ఇండ‌స్ట్రీ ప‌రువు తీస్తుంది. మొన్న‌టికి మొన్న సింగ‌ర్ శ్రీ‌రామ్ రాస‌లీల‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆయ‌న పాట‌లెంత బాగా పాడ‌తాడో.. రొమాన్స్ కూడా అంతే బాగా చేస్తాడంటూ సెటైర్ వేసింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ పై కూడా నోరు పారేసుకుంది. దానికి తోడు ఇప్పుడు నాని పేరు చెప్ప‌కుండా న్యాచుర‌ల్ స్టార్ అంటూ ఆయ‌న్ని తిట్టిపోస్తుంది.
నీ చేతుల్లో మోస‌పోయిన అమ్మాయిల ఉసురు నీకు త‌గులుతుందంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు కమెంట్స్ చేస్తూనే ఉంది. ఇంత మాట్లాడుతున్నా కూడా శ్రీ‌రెడ్డిపై ఎందుకు ఎవ‌రూ యాక్ష‌న్ తీసుకోవ‌డం లేదు. ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లు ఒక్క‌సారి మాట్లాడితే స‌రిపోతుంది క‌దా..! త‌న అవ‌కాశాల కోసం.. త‌న క్రేజ్ కోసం ఇండ‌స్ట్రీ ప‌రువును బ‌జారున పెడ‌తానంటే ఎలా..? ఇప్పుడు శ్రీ‌రెడ్డి చేస్తుంది ఇదే. త‌నకు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని ఇండ‌స్ట్రీని త‌ప్పు ప‌డుతుంది. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన ఓ ద‌ర్శ‌కుడు.. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్న టాప్ డైరెక్ట‌ర్.. దేశాన్ని మార్చేస్తా.. గ్రామాల్ని మార్చేస్తా.. రాజ‌కీయాల్ని మార్చేస్తా.. మ‌నిషిని మార్చేస్తా అంటూ లెక్చ‌ర్లు ఇచ్చే ఓ స్టార్ డైరెక్ట‌ర్ ముందు త‌న‌ను తాను మార్చుకోవాలంటూ శ్రీ‌రెడ్డి ఫైర్ అవ్వ‌డం.. అత‌డిపై కొన్ని ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.
పైగా త‌ను ఎవ‌ర్ని ఉద్దేశించి చెబుతున్నానో అర్థ‌మౌతుంది క‌దా అంటూ సెటైర్ వేయ‌డం మ‌రో హైలైట్. ఇండ‌స్ట్రీలో చాలామంది అమ్మాయిల‌ను ఆయ‌న వాడుకుంటున్నాడ‌ని డైరెక్ట్ గానే డైరెక్ట‌ర్ గారిపై నోరు పారేసుకుంది శ్రీ‌రెడ్డి. ఈమె క‌మెంట్స్ తో ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారిగా హీట్ పెరిగింది. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రా అని ఆలోచించి.. తీరా బుర్ర‌లో అత‌డు ఎవ‌రో త‌ట్టిన త‌ర్వాత నోటిపై వేలేసుకోవ‌డం చాలా మంది వంత‌వుతుంది ఇప్పుడు. పైకి జెంటిల్మెన్ లా క‌నిపించే ఆ ద‌ర్శ‌కుడులో ఇంత ర‌సికుడు ఉన్నాడా అని షాక్ అవుతున్నారంతా. అవ‌కాశాల పేరుతో మ‌భ్యపెట్టి అమ్మాయిల‌ను ఆయ‌న వాడుకుంటున్నాడ‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అప్ప‌ట్లో త‌మిళ ఇండ‌స్ట్రీని ఊపేసిన సుచీలీక్స్ మాదిరి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీని శ్రీ‌లీక్స్ ఊపేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here