శ్ర‌ద్ధగా ప‌ని చేసుకుంటుందిగా..

శ్ర‌ద్ధాక‌పూర్.. ఇన్నాళ్లూ ఈ పేరు బాలీవుడ్ లో మాత్ర‌మే వినిపించేది. కానీ ఇప్పుడు సాహో పుణ్య‌మా అని ఇక్క‌డ కూడా బాగానే వినిపిస్తుంది. ఈ చిత్రం కోసం అమ్మాయిగారు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వ‌స్తున్నారు. హిందీ హీరోయిన్ ను తీసుకొస్తున్నాం అని చెప్ప‌డానికి చాలా ఈజీగానే ఉంటుంది. కానీ నిర్మాత‌ల‌కు మాత్రం త‌డిసి మోపెడ‌వుతుంది. వాళ్ల‌ను ఇక్క‌డికి తీసుకురావాలంటే ఆస్తులు రాసిచ్చేయాలి. బాలీవుడ్ లో 2 కోట్లు తీసుకునే హీరోయిన్ కూడా ఇక్క‌డికి వ‌స్తే 4 కోట్లు కావాలి అని గారాలు పోతుంది. అక్క‌డ క్రేజ్ త‌గ్గినా కూడా ఇక్క‌డ మాత్రం ఓ రేంజ్ లో బిల్డ‌ప్ ఇస్తుంటారు. ఇప్పుడు శ్ర‌ద్ధాక‌పూర్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. నిజానికి బాలీవుడ్ లో ఇప్పుడు ఈ భామ‌కు అంత డిమాండ్ లేదు. వ‌ర‌స ప్లాపుల‌తో శ్ర‌ద్ధాక‌పూర్ కెరీర్ గాడి త‌ప్పింది.
ఇలాంటి టైమ్ లో సాహో సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ మ‌ధ్యే ప్ర‌భాస్ తో క‌లిసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రం కోసం శ్ర‌ద్ధాక‌పూర్ కు ఏకంగా 4 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అది కూడా ఎక్కువ‌గా ముంబైలోనే షూటింగ్.. ప్ల‌స్ బాలీవుడ్ లోనూ సినిమా విడుద‌ల‌వుతుంది కాబ‌ట్టి ఒప్పుకుంది ఈ బ్యూటీ. సాహో షూటింగ్ ఎక్కువ‌గా ముంబై.. రుమేనియా.. దుబాయ్ ల‌లోనే జ‌ర‌గ‌బోతుంది. సాహో షూటింగ్ కు చిన్న బ్రేక్ రావ‌డంతో మ‌ధ్య‌మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది శ్ర‌ద్ధాక‌పూర్. సాహో కొత్త షెడ్యూల్ కు ఇంకా టైమ్ ఉండ‌టంతో మిగిలిన ప‌నులు కూడా చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. 2018 లో సాహో విడుద‌ల కానుంది. మ‌రి ఆ సినిమా రిలీజైన త‌ర్వాత అమ్మాయిగారి హొయ‌లు ఎలా ఉంటాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here