షాక్.. ఎన్టీఆర్, చ‌ర‌ణ్ వ‌చ్చేసారు..!


 
మొన్నటికి మొన్న అమెరికా వెళ్లారు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్. అక్క‌డే ప‌ది రోజులు ఉండి ఫోటోషూట్ తో పాటు రాజ‌మౌళి సినిమాకు సంబంధించిన ప‌నులు చేసుకుని వ‌స్తామ‌ని చెప్పారు. కానీ వారం కూడా కాలేదు అప్పుడే ఇండియాకు వ‌చ్చేసారు. ఇంటిమీద బెంగ‌తో కాదు కానీ అక్క‌డ‌కి వెళ్లిన ప్రోగ్రామ్ త్వ‌ర‌గానే అయిపోయింది.. దానికితోడు ఇక్క‌డ చ‌ర‌ణ్ కోసం బోయ‌పాటి వేచి చూస్తున్నాడు. అదీకాక ఎన్టీఆర్ కు కూడా క‌ళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎమ్మెల్యే ప్ర‌మోష‌న్ లో భాగంగా పాల్గొంటున్నాడు. దాంతో అన్న‌య్య కోసం మ‌రోమాట లేకుండా అమెరికా నుంచి వ‌చ్చేసాడు త‌మ్ముడు. ఇక చ‌ర‌ణ్ కూడా వ‌చ్చీరాగానే బోయ‌పాటి సినిమాపైనే దృష్టి పెట్టాడు. ఈ చిత్ర రెండో షెడ్యూల్ మార్చ్ 18 త‌ర్వాత మొద‌లు కానుంది. వైజాగ్ లో రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ వేడుక ఉగాది రోజే జ‌ర‌గ‌బోతుంది.
ఆ మ‌రుస‌టి రోజు నుంచే బోయ‌పాటి సినిమా కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. ఇక ఎన్టీఆర్ మార్చ్ 23 నుంచి త్రివిక్ర‌మ్ సినిమాకు ఎలాగూ ఫిక్స్ అయ్యాడు. ఈ ఇద్ద‌రు హీరోలు అక్టోబ‌ర్ లోపే ఫ్రీ కానున్నారు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి వాళ్ల‌ను త‌న ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. మ‌రో ఏడాదిన్న‌ర పాటు ఇంకో సినిమా ధ్యాసే లేకుండా అక్క‌డే అరెస్ట్ చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. గ‌త కొన్ని ద‌శాబ్ధాల్లో తెలుగులో రాబోయే అతిపెద్ద మ‌ల్టీస్టార‌ర్ ఇదే కావ‌డం విశేషం. దాంతో ఎక్క‌డా ఛాన్స్ తీసుకోవ‌డం లేదు రాజ‌మౌళి. ఈ సినిమాలో స‌మంత‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టించే అవ‌కాశం ఉంది. మార్చ్ 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానుంద‌ని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here