షాక్.. ప్రియాంక చోప్రాకు 18 ఏళ్ల కూతురు..!

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇదే చ‌ర్చ‌. ప్రియాంక చోప్రాకు 18 ఏళ్ల కూతురు ఏంటి అని..? ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇన్నాళ్లూ హాలీవుడ్ లో ఉన్న ప్రియాంక ఈ మ‌ధ్యే మ‌ళ్లీ ఇండియాకు వ‌చ్చింది. ఇక్క‌డ బాలీవుడ్ ఒక‌టి ఉంద‌ని గుర్తు చేసుకుంది. అందుకే సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్ప‌టికే స‌ల్మాన్ ఖాన్ హీరోగా భ‌ర‌త్ సినిమాలో న‌టించ‌డానికి ఓకే చెప్పింది ప్రియాంక చోప్రా.
ఈ చిత్రం ఇలా ఉండ‌గానే ఇప్పుడు అయేషా చౌద‌రి జీవితంపై తెర‌కెక్క‌బోయే సినిమాలోనూ న‌టించ‌బోతుంది ప్రియాంక‌. ఇంత‌కీ ఈ అయేషా ఎవ‌రు అంటే పూణేలో ఓ 18 ఏళ్ల అమ్మాయి. చిన్న‌పుడే ఎమ్మునోడిఫీసియ‌న్సీ.. ఆ త‌ర్వాత 13 ఏళ్ల వ‌య‌సులో ప‌ల్మోన‌రీ ఫైబ్రోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన ప‌డి బ‌తికి ఉన్న ప్ర‌తీరోజు న‌ర‌కం చూసిన అమ్మాయి. చివ‌రికి 18 ఏళ్ల వ‌య‌సులోనే ఆమె త‌నువు చాలించింది.
అప్ప‌ట్లో ఈ అమ్మాయి వ్యాధి గురించి చాలా చ‌ర్చ‌లే జ‌రిగాయి. ఈమె జీవితం ఆధారం గా ఓ సినిమా చేయ‌బోతున్నారు షోనాలీ బోస్. ఇందులో అయేషా పాత్ర‌లో దంగ‌ల్ ఫేమ్ జైరా వ‌సీం న‌టించ‌బోతుంది. ఇక ఆమె త‌ల్లిదండ్రులుగా ప్రియాంక చోప్రా, అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టించ‌బోతున్నారు. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ మొద‌లు కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here