ష‌క‌ల‌క భ‌లే క‌వ‌ర్ చేసాడుగా..!


తాము తీసిన సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఎప్పుడూ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాత్రం ప‌నికిరాదు. కానీ అది చూపించాడు ష‌క‌ల‌క శంక‌ర్. ఈయ‌న శంభో శంక‌ర‌తో హీరో అయ్యాడు. విడుద‌ల‌కు ముందు అస‌లు త‌మ సినిమా తోప‌ని.. క‌త్త‌ని.. ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ త‌మ‌ను న‌మ్మ‌లేద‌ని ఆవేద‌న‌తో చెప్పుకున్నాడు గాధ‌. కానీ ఇప్పుడు ఏమైంది.. సినిమా వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు. శంక‌ర్ అంటేనే ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌రు.
శ‌క‌ల‌క శంకర్ అంటే మాత్రం వెంట‌నే గుర్తు ప‌డ‌తారు. ప‌వ‌న్ అభిమానిగా.. కాదు కాదు భ‌క్తుడిగా అంద‌రికీ ప‌రిచ‌యం ఈ క‌మెడియ‌న్. అయితే తాను దేవుడిగా భావించే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఒక‌సారి త‌న్నులు తిన‌బోయాన‌ని చెప్పాడు ఈ క‌మెడియ‌న్. కానీ దాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చేసుకున్నాడు. అప్ప‌ట్లో ప‌వ‌న్ తో చివాట్లు తిన్న శంక‌ర్ అంటూ వార్త‌లు బాగానే వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంపై మాట్లాడిన ఈ క‌మెడియ‌న్..
స‌ర్దార్ సెట్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఒక‌రు మాటిమాటికి తీసిన సీన్సే తీస్తుంటే చిరాకు ప‌డ్డాన‌ని.. ప‌వ‌న్ దానికి నిర్మాత కాబ‌ట్టి ఆయ‌న డ‌బ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అనే బాధ‌తోనే అలా అన్నాన‌ని చెప్పాడు శంక‌ర్. కానీ ఆ త‌ర్వాత ప‌వ‌న్ వ‌చ్చి అప్పుడే ద‌ర్శ‌కుల‌కు చెప్పే స్థాయికి వ‌చ్చావా అంటూ తిట్టార‌ని చెప్పాడు శంక‌ర్. కానీ ఇందులో సీన్ మాత్రం మ‌రోలా జ‌రిగింద‌ని అక్క‌డ ఉన్న‌వాళ్లు అప్ప‌ట్లో చెప్పిన మాట‌. సెట్ లో శంక‌ర్ చేసిన ఎక్స్ ట్రాలు చూసి ప‌వ‌న్ కోప్ప‌డ‌టం కాదు.. కొట్టారంటారు. కానీ ఇప్పుడు సీన్ మాత్రం మ‌రోలా మార్చుకున్నాడు ఈయ‌న‌. మొత్తానికి నిజ‌మేంటో మ‌రి ప‌వ‌న్, శంక‌ర్ ల‌కే తెలియాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here