సంజూబాబా వ‌స్తున్నాడా లేదా..? 


సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ అంటూ ఆ మ‌ధ్య ఓ సినిమా మొద‌లైన సంగ‌తి తెలిసిందే క‌దా..! అది కూడా చిన్న ద‌ర్శ‌కుడు కాదు మొద‌లు పెట్టింది.. రాజ్ కుమార్ హిరాణి. ప‌రాజ‌యం లేని ద‌ర్శ‌కుడు. నీళ్లు తాగినంత ఈజీగా ఇండ‌స్ట్రీ హిట్లు కొట్టే ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. అలాంటి ద‌ర్శ‌కుడు సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. అందులో ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తున్నాడు. అప్ప‌ట్లో ఫ్యూచ‌ర్ సూప‌ర్ స్టార్.. బాలీవుడ్ ను మ‌రో ప‌దేళ్ల పాటు దున్నేస్తాడు.. బాక్సాఫీస్ కింగ్.. అంటూ నాలుగేళ్ల కింద ర‌ణ్ బీర్ దూకుడు చూసి వ‌చ్చిన వార్త‌లు. కానీ ఇప్పుడు మ‌నోడి కెరీర్ దారుణంగా ఉంది. అది కూడా చిన్న‌మాటే. ర‌ణ్ బీర్ క‌పూర్ సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. ఇది క‌దా ద‌రిద్రం అంటే. బేష‌ర‌మ్.. రాయ్.. బాంబే వెల్‌వెట్.. తమాషా.. ఇలా అన్ని సినిమాలు డిజాస్ట‌ర్లే.  ఇప్పుడు మ‌నోడి ఆశ‌ల‌న్నీ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కిస్తోన్న సంజయ్ దత్ జీవిత క‌థ‌పైనే ఉన్నాయి. సంజూ టైటిల్ తో ఈ సినిమా వ‌స్తుంది. జ‌న‌వ‌రి 21నే షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్ వివాదాల‌తో పాటు జీవితాన్ని మొత్తం చూపించ‌బోతున్నాడు రాజ్ కుమార్ హిరాణి. జూన్ 29న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా ర‌ణ్ బీర్ కెరీర్ గాడిన ప‌డుతుందో లేదంటే మ‌రింత దిగ‌జారుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here