సందీప్ రెడ్డితో రామ్ చ‌ర‌ణ్.. ఏదో జ‌రుగుతుంది..?

Ram Charan Sandeep Vanga

అర్జున్ రెడ్డి సినిమా చూసి అంతా ఒక‌టే మాట అనుకున్నారు.. ఎవ‌ర్రా ఈ డైరెక్ట‌ర్.. ఇలా తీసాడు.. అస‌లు ఈయ‌న తొలి సినిమా ఇదేనా.. మెంట‌ల్ ఎక్కించేసాడ్రా బాబూ..! ఇదిగో ఇలాంటి క‌మెంట్సే వినిపించాయి అర్జున్ రెడ్డి సినిమా త‌ర్వాత‌. ఓ ర‌కంగా మూస‌లో ఉన్న ఇండ‌స్ట్రీకి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడి రెండో సినిమాపై ఇండ‌స్ట్రీలో కావాల్సిన‌న్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డితో మ‌హేశ్ సినిమా చేయ‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. విన‌డానికి కాస్త వింత‌గా ఉంది క‌దా.. కానీ ఇదే నిజ‌మ‌య్యే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి విడుద‌ల త‌ర్వాత అంతా ట్విట్ట‌ర్ లో అభినందిస్తే.. సందీప్ ను ప్ర‌త్యేకంగా క‌లిసాడు మ‌హేశ్ బాబు. ట్విట్ట‌ర్ లో కూడా ఈ కుర్ర ద‌ర్శ‌కుడిని అభినందించాడు.
అంతేకాదు.. మ‌హేశ్ కోసం సందీప్ ను ఓ క‌థ కూడా సిద్ధం చేయాలంటూ న‌మ్ర‌త కోరింది. అర్జున్ రెడ్డితో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు సందీప్ రెడ్డి. తీసింది అడ‌ల్ట్ కంటెంట్ సినిమానే అయినా.. దాన్నే ట్రెండీగా తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో మ‌నోడు తీసిన బోల్డ్ సినిమాకు అంతా బెండ్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా సందీప్ రెడ్డితో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కుర్ర ద‌ర్శ‌కుడితో చ‌ర‌ణ్ దిగిన ఫోటోను ఉపాస‌న ట్వీట్ చేయ‌డం విశేషం. ఈ ఫోటోలో శ‌ర్వానంద్ కూడా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ లో సినిమా రానుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతానికి రంగ‌స్థ‌లం.. బోయ‌పాటి.. రాజ‌మౌళి సినిమాల‌తో బిజీగా ఉన్న చ‌ర‌ణ్.. సందీప్ రెడ్డి సినిమాను కూడా ఓకే చేస్తాడేమో మ‌రి..! మొత్తానికి ఈ కుర్ర ద‌ర్శ‌కుడి సంచ‌ల‌నాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here