సస్పెన్స్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తున్న నవీన్ చంద్ర

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్లో  నవీన్ చంద్ర హీరోగా, శాలిని వడినికట్టి హీరోయిన్ గా కొత్త కాన్సెప్ట్  సరికొత్త కథనంతో సస్పెన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 80% చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ద్వారా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కర్చుకి ఎక్కడా వెనకాడకుండా, నాణ్యతతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా సాయి అభిషేక్ గారు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 40% చిత్రీకరణ  విదేశాలలో ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది
తారాగణం:
ప్రియదర్శి (పెళ్ళిచూపులు ఫేమ్), రాజా రవీంద్ర, viva హర్ష, అభయ్ (పెళ్ళిచూపులు ఫేమ్), తదితరులు.
సాంకేతిక వర్గం:
నిర్మాత: సాయి అభిషేక్
దర్శకుడు: డా. అనిల్ విశ్వనాథ్ (క్షణం- సహదర్శకుడు, నరుడా డోనరుడా- లైన్ ప్రొడ్యూసర్)
సినిమాటోగ్రాఫర్: వంశి పచ్చిపులుసు (క్షణం- ఆపరేటివ్ కెమెరామెన్)
ఎడిటర్: గ్యారి బి హెచ్ (క్షణం)
సంగీత దర్శకుడు: శ్రవణ్ (ప్రేమ ఇష్క్ కాదల్, అలియాస్ జానకి, సావిత్రి)