సాంగ్స్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న’దర్పణం’

వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న చిత్రం ‘దర్పణం’. తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సాంగ్స్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

Darpanam songs shooting completed
చిత్ర నిర్మాత ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..’దర్పణం నా మొదటి చిత్రం. ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు రామకృష్ణ కథ చెప్పిన విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి ప్రేమకథ. ఎటువంటి ఆటంకం లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేశాము. వైజాగ్, అరకు లొకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరణ కూడా పూర్తి చేశాము. డిసెంబర్ లో ఆడియోని విడుదల చేసి, జనవరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’ అని తెలిపారు.
తనిష్క్‌ రెడ్డి, అలెక్సియస్‌, సుభాంగి పంత్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్ధ్‌ సదాశివుని, కెమెరా: సతీష్‌ ముత్యాల, స్టంట్స్‌: మల్లేష్‌, ఎడిటర్‌: ఈ.ఎస్‌. ఈశ్వర్‌, పి.ఆర్‌.ఓ.: బి.వీరబాబు, నిర్వహణ: నిమ్మల అంజన్ బాబు, సహనిర్మాతలు: కేశవ్‌ దేశాయ్‌, క్రాంతి కిరణ్‌ వెల్లంకి, నిర్మాత: వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌ యాదవ్‌), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి. రామకృష్ణ.