సాయికి దిక్కు ఆ వినాయ‌కుడే ఇక‌.. 

Sai Dharam Tej’s Jawaan First Day Collections
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటూ ఇప్పుడు సాయిధ‌రంతేజ్ అల్లాడిపోతున్నాడు. కెరీర్ మొద‌ట్లో వ‌ర‌సగా విజ‌యాలు అందుకుని స్టార్ గా మారిన మెగా మేన‌ల్లుడు.. ఇప్పుడు మాత్రం ఫ్లాపుల ప‌రంప‌ర సాగిస్తున్నాడు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్లుగా చాప చుట్టేస్తుంది కానీ ఏ ఒక్క‌టి నిల‌బ‌డటం లేదు. దాంతో సాయి చూపులు ఇప్పుడు వినాయ‌క్ సినిమాపైనే ఉన్నాయి. చేజేతులా చేసిన తిక్క‌.. న‌క్ష‌త్రం సినిమాలు సాయి ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసాయి. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన విన్న‌ర్ తో పాటు ఈ మ‌ధ్యే విడుద‌లైన జ‌వాన్ కూడా సాయిధ‌రంతేజ్ ఆశ‌ల‌ని నిల‌బ‌ట్టలేక‌పోయాయి. వీటిలో జ‌వాన్ క‌నీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక‌పోయింది. విన్న‌ర్ ఫ్లాపైనా కూడా 15 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది. కానీ ఇప్పుడు జ‌వాన్ అది కూడా చేసేలా క‌నిపించ‌ట్లేదు. 10 కోట్ల మార్క్ ద‌గ్గ‌రే అటూ ఇటూ ఊగుతుంది జ‌వాన్.
ఇన్ని ఫ్లాపులు వ‌చ్చినా కూడా ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు సాయిధ‌రంతేజ్. ఈ సినిమాలే సాయి కెరీర్ కు ఊపిరి. ఇందులో ఒక‌టి వినాయ‌క్ తో సినిమా. ఖైదీ నెం.150 లాంటి సినిమా త‌ర్వాత ఏరికోరి సాయిధ‌రంతేజ్ తో సినిమా చేస్తున్నాడు వినాయ‌క్. ఆకుల శివ అందించిన క‌థ‌కు సాయి అయితేనే ప‌ర్ ఫెక్ట్ అని భావించాడు వినాయ‌క్. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూటింగ్ తో బిజీగా ఉంది ఈ చిత్రం. ఇందులో సాయి మాస్ రోల్లో క‌నిపిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఇక క‌రుణాక‌ర‌ణ్ తో క‌మిటైన సినిమా కూడా ఈ మ‌ధ్యే మొద‌లైంది. అయితే ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. ఈ రెండు సినిమాల‌తో మ‌ళ్లీ కెరీర్లో పుంజుకోవాల‌ని చూస్తున్నాడు సాయిధ‌రం తేజ్. మ‌రి చూడాలిక‌.. మెగా మేన‌ల్లుడి కెరీర్ ఎటు వెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here