సాయిప‌ల్ల‌వి నిజంగానే అలా చేస్తుందా..?

సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్. ఒక్క సినిమాతోనే ఇండ‌స్ట్రీని షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న క్యూట్ యాక్టింగ్ తో అంద‌ర్నీ ఫిదా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిప‌ల్ల‌వి అంటే కేరాఫ్ క్లీన్ ఇమేజ్.. అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూ.. కేవ‌లం న‌ట‌న‌తోనే నెట్టుకొస్తుంది ఈ త‌మిళ పొన్ను. దానికి తోడు స్టార్ హీరోల సినిమాల‌ను కాద‌ని.. కేవ‌లం త‌న‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్ప‌టికే కొంద‌రు స్టార్ హీరోల‌కు కూడా నో చెప్పింది సాయిప‌ల్ల‌వి. ఇలాంటి హీరోయిన్ పై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొన్ని రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఈమె సెట్ కు టైమ్ కు రాద‌ని.. షూటింగ్ ల‌కు ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎంసిఏ సెట్ లోనే నాని, సాయిప‌ల్ల‌వికి ఈ విష‌యంలోనే గొడవ జ‌రిగింద‌నే వార్తలు అప్ప‌ట్లో వినిపించాయి.
దిల్ రాజే ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చాడ‌నే టాక్ కూడా వ‌చ్చింది. ఇప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి తీరు మార‌లేదంటున్నారు కొంద‌రు. ఉద‌యం 9 గంట‌ల‌కు రావాల్సిన సెట్ కు 11-12 గంట‌ల‌కు వ‌స్తుందని.. దానివ‌ల్ల నిర్మాత‌ల‌తో పాటు చిత్ర‌యూనిట్ కూడా చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌నే కంప్లైంట్స్ సాయిప‌ల్ల‌విపై వ‌స్తున్నాయి. చూడ్డానికి ఇంత అమాయ‌కంగా.. ఏం తెలియ‌న‌ట్లు ఉంటుంది కానీ సాయిప‌ల్ల‌విపై ఇలాంటి రూమ‌ర్లు వినిపించ‌డం మాత్రం విడ్డూర‌మే. ఇవి అబ‌ద్ధ‌మైతే ఓకే.. కానీ నిజ‌మే అయితే మాత్రం క‌చ్చితంగా ఈ భామ కెరీర్ పై అది ప్ర‌భావం చూపించ‌కుండా ఉండ‌దు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here