సాయి అలా మిస్స‌య్యాడ‌న్న క‌ళ్యాణ్..

Kalyanram Virinchi Varma
టాలీవుడ్ లో ఎన్ని కుటుంబాలున్నా కూడా మెగా.. నంద‌మూరి ఫ్యామిలీస్ కు ఉన్న ఇమేజే వేరు. మాస్ కు కేరాఫ్ అడ్ర‌స్ రెండు కుటుంబాలు. రెండు ఫ్యామిలీస్ కు బోలెడంత చరిత్ర ఉంది. స‌రైన సినిమా ప‌డితే ఇండ‌స్ట్రీ లెక్క‌లు మార్చేసే హీరోలు ఈ రెండు ఫ్యామిలీస్ లోనూ ఉన్నారు. ఇక ఈ రెండు కుటుంబాల‌కు ప‌డ‌ద‌నే టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంటుంది. అయితే ఈ రూమ‌ర్లకు చెక్ పెడుతూ.. మెగా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ కు రంగం సిద్ధం చేస్తున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికే నంద‌మూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్.. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించ‌నున్నారు రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ లో. అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది కూడా. అయితే ఈ సినిమా కంటే ముందే మెగా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ కు బీజం ప‌డింది.
అప్ప‌ట్లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్.. నంద‌మూరి ప‌టాస్ క‌ళ్యాణ్ రామ్ క‌ల‌యిక‌లో ద‌ర్శ‌కుడు ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ఓ క‌థ సిద్ధం చేసాడు. అయితే ఈ క‌థ అప్ప‌ట్లో ఇద్ద‌రు హీరోల‌కు న‌చ్చ‌లేదు. దాంతో ఈ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నాడు. ఈ సినిమాపై ఇప్పుడు త‌న మ‌న‌సులో మాట చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. అప్ప‌ట్లో తాను సాయి క‌లిసి న‌టించాల‌నుకున్న మాట నిజ‌మే అయినా.. ఎందుకో క‌థ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల న‌టించ‌లేద‌ని చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. అయితే అప్పుడు మిస్ అయినా ఫ్యూచ‌ర్ లో త‌ప్ప‌కుండా క‌థ కుదిర్తే సాయిధ‌రంతేజ్ తో న‌టిస్తాన‌ని చెబుతున్నాడు క‌ళ్యాణ్. మ‌రోవైపు ఇప్పుడు తాను ఒప్పుకున్న ప‌వ‌న్ సాధినేని సినిమా మ‌ల్టీస్టార‌ర్ అని చెబుతున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో మ‌రో హీరోకు కూడా స్కోప్ ఉంది. ఆ పాత్ర కోస‌మే కుర్ర హీరోను తీసుకుంటున్నారు. మొత్తానికి చూడాలిక‌.. క‌ళ్యాణ్ రామ్ మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉండ బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here