సాహోలో ఆమె కూడా ఉంద‌ట‌గా..


ఇప్ప‌టికే సాహో తెలుగు రేంజ్ దాటిపోయింది. ఈ చిత్రంలో ఎక్క‌డ చూసినా బాలీవుడ్ మొహాలే క‌నిపిస్తున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుండ‌టంతో ఎక్క‌డా త‌గ్గ‌కుండా అంద‌ర్నీ ప‌ట్టుకొస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇప్ప‌టికే ఈ చిత్రంలో ప్ర‌భాస్ తో పాటు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడి, టినూ ఆనంద్, శ్ర‌ద్ధాక‌పూర్ న‌టిస్తున్నారు. వీళ్లంతా కేరాఫ్ బాలీవుడ్డే. ఇక ఇప్పుడు వీళ్ళ‌కు తోడుగా మ‌రో బాలీవుడ్ ఫేస్ యాడ్ అయింది.
ఆమె ఎవ్లిన్ శ‌ర్మ‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు. కానీ అందాన్ని ఆస్వాదించ‌డానికి పేరుతో ప‌నిలేదు క‌దా. అందుకే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ భామ‌కు తెగ అవ‌కాశాలిస్తున్నారు. ఇప్పుడు సాహోలో కూడా ఈమె కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతుంది. అది కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ గాళ్ ఫ్రెండ్ పాత్ర ఇది అని తెలుస్తుంది. ఇప్ప‌టికే అక్క‌డ‌ ఏ జ‌వానీ హై దివానీ..
కుచ్ కుచ్ లోతా హై.. యారియాన్ లాంటి సినిమాల్లో న‌టించిన ఎవ్లీన్ శ‌ర్మ‌కు ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అందుకే అన్ని ఓపెన్ చేసి కెమెరా ముందు ప‌రిచేసింది ఈ 31 ఏళ్ల ముద్దుగుమ్మ‌. ఇలాంటి టైమ్ లో సాహో సినిమా వ‌చ్చింది. మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాతో తెలుగులో ఎవ్లిన్ జాత‌కం మారుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here