సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన హీరో సూర్య‌

సీనియ‌ర్ పాత్రికేయుడు, సూప‌ర్‌హిట్ ప‌త్రిక ఎడిట‌ర్‌, నిర్మాత బి.ఎ.రాజు పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 7. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మక్షంలో జ‌రిగిన పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో బి.ఎ.రాజు బ‌ర్త్‌డే కేక్‌ను క‌ట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరో సూర్య‌..బి.ఎ.రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం …
హీరో సూర్య మాట్లాడుతూ – “బి.ఎ.రాజుగారితో ఎప్ప‌టి నుండో నాకు, మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ఆయ‌న‌కు ఎంతో అనుభవం, గ్రిప్ ఉంది.  నా సినిమాల‌కు ఆయ‌న ఎప్పుడూ త‌న స‌పోర్ట్‌ను అందిస్తూ వ‌స్తున్నారు. త‌న విలువైన సూచ‌న‌లిస్తుంటారు. చాలా మంచి హృద‌య‌మున్న వ్య‌క్తి. ఈరోజు ఆయ‌న పాత్రికేయుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటున్న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో నేను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. బి.ఎ.రాజుగారు ఆయురారోగ్యాల‌తో ఇలాంటి పుట్టిన‌రోజుల‌ను మ‌రిన్ని జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here