సుధీర్ బాబు బాగానే చేసాడబ్బా..!

Sudheer Babu

ఇప్ప‌టి వ‌ర‌కు సుధీర్ బాబు అర‌డ‌జ‌న్ సినిమాలు చేసాడు. హీరోతో పాటు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ క‌నిపించాడు. కానీ ఎప్పుడూ మ‌హేశ్ బావ‌గానే ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కానీ ఈయ‌న సొంత హీరోగా.. న‌టుడిగా మాత్రం గుర్తింపు రాలేదు. ఇప్ప‌టికీ సొంత గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు ఈ హీరో.

అయితే ఇప్పుడు అది వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ప్రేమ‌క‌థాచిత్రం.. భ‌లే మంచి రోజు.. శ‌మంత‌క‌మ‌ణి లాంటి సినిమాలు న‌టుడిగా గుర్తింపు తీసుకొచ్చినా.. ఇప్పుడు స‌మ్మోహ‌నంతో సుధీర్ కెరీర్ హైట్స్ కు చేరిపోయింది. ఈ చిత్రంలో సుధీర్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. ఇందులో ఇంద్ర‌గంటి కూడా సుధీర్ లోని న‌టున్ని బాగానే ఆవిష్క‌రించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో చాలా బాగా న‌టించాడంటున్నారు ప్రేక్ష‌కులు.

ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఎలా ఉన్నా కూడా సుధీర్ కెరీర్ కు మాత్రం మంచి బూస్ట‌ప్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. పైగా ఇప్పుడు ఇది కాకుండా మ‌రో రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. మొత్తానికి ఇప్పుడిప్పుడే సుధీర్ బాబు కెరీర్ గాడిన ప‌డుతుంది. అన్న‌ట్లు ఈ మ‌ధ్యే సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ ను కూడా స్థాపించాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ హీరో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికి వెళ్లి ఆగుతాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here