సూప‌ర్ స్టార్.. ఛ‌లో హిమాల‌యాస్.. 


ర‌జినీ మ‌ళ్లీ హిమాల‌యాల‌కు వెళ్తున్నాడు. ఈయ‌న ప్ర‌తీ ఏడాది అక్క‌డికి వెళ్తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. సినిమాలు ప‌క్క‌న‌బెట్టి మ‌రీ కొన్ని రోజులు అక్క‌డే ఉండి వ‌స్తాడు. ఇప్పుడు కూడా మ‌ళ్లీ హిమాల‌యాల‌కు ప‌య‌నం అవుతున్నాడు ర‌జినీకాంత్. ఈ మ‌ధ్యే పొలిటిక‌ల్ పార్టీ పెట్టిన ర‌జినీ.. ఇప్పుడు కొన్ని రోజులు అక్క‌డికి వెళ్లి సేద తీరాల‌ని చూస్తున్నాడు. ర‌జినీ హిమాల‌యాల‌కు వెళ్ల‌డం కొత్త కాదు. ప్ర‌తీ ఏడాది అక్క‌డికి వెళ్లి కొన్ని రోజులు ధ్యానం చేసుకుని వ‌స్తారు సూప‌ర్ స్టార్. ఇప్పుడు ఆయ‌న ఫ్రీగానే ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న క‌మిటైన కాలా.. 2.0 సినిమాలు పూర్త‌య్యాయి. దాంతో అక్క‌డే కొన్నిరోజులు ఉండి.. ధ్యానం చేసుకుని వ‌చ్చిన త‌ర్వాత కార్తిక్ సుబ్బ‌రాజ్ సినిమాతో బిజీ కానున్నాడు. దాంతో పాటు రాజ‌కీయాల్లోనూ బిజీ కావాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. ఇప్ప‌టికే హిమాల‌యాల్లో కొంత స్థ‌లం కూడా కొన్నాడు ర‌జినీ. అక్క‌డే ఉండే సాధువుల‌కు సొంతంగా ఓ ఆశ్ర‌మం క‌డుతున్నాడు సూప‌ర్ స్టార్.
ఇక హిమాల‌యాల‌తో పాటు రాజ‌కీయాల‌పై మ‌న‌సు బాగా ప‌డిన‌ట్లుంది. అందుకే ఒప్పుకున్న సినిమాల‌ను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు సూప‌ర్ స్టార్. సాధార‌ణంగా ర‌జినీ సినిమా అంటే ఎప్పుడు మొద‌లై ఎప్ప‌టికి పూర్తవుతుందో క్లారిటీ ఉండ‌దు. పైగా ఆయ‌న్నుంచి ఒక్కో సినిమా రావాలంటే కనీసం రెండేళ్లైనా ప‌డుతుంద‌ని ఫిక్సైపోయారు అభిమానులు. ఇలాంటి టైమ్ లో మూడు సినిమాల‌తో వ‌స్తున్నాడు ర‌జినీ. కాలా.. 2.0తో పాటు కార్తిక్ సినిమా ఇప్పుడు మొద‌లు కానుంది. ఈ దూకుడుకు కార‌ణం మాత్రం రాజ‌కీయాలే అని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్నాడు ర‌జినీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here