సూర్య పోయింది… డిజే నిలిచింది..


అక్క‌డో ప్రాణం పోయింది.. ఇక్కడో ప్రాణం వ‌చ్చింది.. దేవుడ బ్యాలెన్సింగ్ చేస్తాడురా ప్ర‌పంచ‌కాన్ని అంటూ ఆ మ‌ధ్య ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది ఇప్పుడు అల్లుఅర్జున్ విష‌యంలో అచ్చు గుద్దిన‌ట్లు స‌రిపోయింది. చాలా ఏళ్ళ త‌ర్వాత ఈ హీరోకు డిజాస్ట‌ర్ వ‌చ్చింది.
2010లో వ‌చ్చిన వ‌రుడు త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న‌కు డిజాస్ట‌ర్స్ లేవు. ఫ్లాపులు ఉన్నాయి కానీ మ‌రీ దారుణంగా ముంచేసిన సినిమాలు మాత్రం రాలేదు. కానీ నా పేరు సూర్య‌తో ఆ ముచ్చ‌ట కూడా తీరిపోయింది. అయితే సూర్య పోయిన బాధ‌లో ఉన్న బ‌న్నీకి డిజే మాత్రం ఇంకా సంతోషాన్నిస్తుంది. ఈ చిత్రం వ‌చ్చి ఏడాది పూర్తైనా కూడా ఇప్ప‌టికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. నిజానికి థియేట‌ర్స్ లో అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయిన డిజే..
యూ ట్యూబ్ లో మాత్రం కొత్త రికార్డుల‌కు తెర‌తీస్తుంది. ఇండియాలోనే అత్యంత వేగంగా 150 మిలియన్ వ్యూస్ అంటే.. 15 కోట్ల వ్యూస్ అందుకున్న తొలి సినిమాగా చ‌రిత్ర సృష్టించింది డిజే. అది కూడా హిందీ వ‌ర్ష‌న్.. బ‌న్నీకి ఉన్న నార్త్ ఫాలోయింగ్ ఏంటో డిజే చూపించింది. గ‌తంలో సరైనోడు సినిమా కూడా యూట్యూబ్ లో 10 కోట్ల వ్యూస్ అందుకుంది. ఇప్పుడు డిజేతో మ‌రో రికార్డుకు తెర‌తీసాడు. మొత్తానికి ఇదే క‌దా బ్యాలెన్సింగ్ అంటే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here