సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేతులమీదుగా "U -కథే హీరో" మొదటి పాట విడుదల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్  చేతులమీదుగా  

శ్రీమతి నాగానిక సమర్పణ లో 

కొవెరా క్రియేషన్స్ బ్యాన ర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న “U కథే హీరో” సినిమాలోని మొదటి పాటను విడుదల చేేశారు. ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్  మాట్లాడుతూ ‘ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది .   వినగానే చాలా నచ్చేసింది .  ఈ పాటతో పాటుగా ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను .  మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ కి నా అభినందనలు . అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు . 

దర్శకుడు కొవెరా మాట్లాడుతూ “U మొదటి పాట దేవిశ్రీప్రసాద్ గారి చేతులమీదుగా లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. సత్య మహావీర్ మంచి సంగీతాన్ని అందించి మా సినిమాని మరో స్థాయికి చేర్చారు . మిగిలిన పాటలని కూడా తొందరలోనే విడుదల చేస్తాం.  నేను V. విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసాను. కొన్ని సినిమాలకి రైటర్ గా కూడా చేసి, మొదటి ప్రయత్నంగా ‘U’ మూవీని డైరెక్షన్ చేస్తున్నాను ” అని తెలిపారు . 
 
మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్ మాట్లాడుతూ ” దేవి శ్రీ  ప్రసాద్ గారి చేతులమీదుగా మా పాట విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. “కాటుకెట్టుకోచ్చిన చందమామ ‘ అనే ఈ పాటని  సురేష్ బనిశెట్టి రాసారు . రఘురాం పాడారు .  ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానున్న ఈ ఆల్బం లో పాటలన్ని  కధానుగుణంగా ఉంటాయి ”   అన్నారు . 
స్క్రీన్ ప్లే రచయిత మధు మాట్లాడుతూ”ఈ సినిమాకి వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చెప్పే మాటే అయినా ఈ కధ చాలా కొత్తగా ఉంటుంది. అందుకే “కథే హీరో” అని క్యాప్షన్ గా పెట్టాం” అన్నారు .
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది . 

 త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో కొత్త హీరో 

కొవెర,

 హీరోయిన్

హిమాన్షి కాంట్రగడ్డతో బాటు తనికెళ్ళ భరణి , శుభలేఖ సుధాకర్  కీలక పాత్రలు పోషిస్తునారు. 
రాఘవ(జబర్దస్త్),
నాగి(జబర్దస్త్),
రోహిణి,
సంధ్య,
స్వప్న రావ్,
లహరి(మళ్ళీ రావా ఫేం),
దొరబాబు,
కోయ కిషోర్ తదితరులు నటిస్తున్నారు . 
టెక్నికల్ టీం
 
సినిమాటోగ్రఫీ – రాకేశ్ గౌడ్
మ్యూజిక్ – సత్య మహావీర్ 
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి 
స్క్రీన్ ప్లే – మధు విప్పర్తి, కొవెర.
డైలాగ్స్ – మహి ఇల్లింద్ర, కరుణ్ వెంకట్ 
ఆర్ట్ – జయదేవ్ 
మేకప్ – లక్ష్మణ్ 
కాస్ట్యూమ్స్ – ఆనంద్
ఫ్యాషన్ డిజైనర్ – నాగానికి చాగంరెడ్డి, శ్వేతా రెడ్డి
ఏక్షన్ – షావోలిన్ మల్లేష్ 
ఎగ్జిక్యూటివ్ – ప్రవీణ్ 
ప్రొడక్షన్ కంట్రోలర్ – కరణ్ 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – శివ నాగ శివ గణపర్తి, మూర్తి నాయుడు పాదం 
నిర్మాత – విజయలక్ష్మి కొండా
రచన, దర్శకత్వం -కొవెర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here