సైరాకు అమేజాన్ అంత ప‌ని చేస్తుందా..? 

ఒక‌రు లాభ‌ప‌డుతున్నారంటే దాని అర్థం త‌మ‌కు తెలియ‌కుండానే మ‌రొక‌రు న‌ష్ట‌పోతున్నార‌ని. ఈ రెండూ బేరీజు వేస్తేనే వ్యాపారం. ఇప్పుడు కూడా నిర్మాత‌ల‌కు కొన్ని ఆన్ లైన్ ఛానెల్స్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నాయి. వీటి వ‌ల్ల నిర్మాత‌ల పంట పండుతుంది. కానీ ఛానెల్స్ కొంప మునుగుతుంది. శాటిలైట్ రైట్స్ కు ఇప్పుడు ఉన్న డిమాండ్ మాట‌ల్లో కాదు.. కోట్ల‌ల్లో చెప్పాలి. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలను కోట్లకు కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంటున్నాయి ఛానెల్స్. వాటిని త‌మ ఛానెల్స్ లో ప్లే చేసుకున్న‌పుడు యాడ్స్ నుంచి అంత రాబ‌ట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు శాటిలైట్ హ‌క్కుల‌కు పోటీగా డిజిట‌ల్ రైట్స్ రంగంలోకి దిగుతున్నాయి. డిజిట‌ల్ రైట్స్ పై ఇన్నాళ్లూ ఎవ‌రికీ పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. కానీ ఇది ఇప్పుడు నిర్మాత‌ల‌కు వ‌రంగా మార‌నుంది. ఇన్నాళ్లూ శాటిలైట్ తో పాటే డిజిట‌ల్ రైట్స్ కూడా క‌లిపి ఇచ్చేవాళ్లు నిర్మాత‌లు.
అప్పుడు నిర్మాత‌ల‌కు మ‌రో అవ‌కాశం లేదు. కానీ ఇప్పుడు ఆ అవ‌స‌రం లేదు. హాట్ స్టార్, అమేజాన్ లాంటి సంస్థ‌లు డిజిట‌ల్ రైట్స్ ని భారీ రేట్ కు తీసుకుంటున్నాయి. దాంతో నిర్మాత‌లు ఛానెల్స్ కు కేవ‌లం శాటిలైట్ మాత్ర‌మే అమ్ముకుంటున్నారు. ప్ర‌త్యేకంగా డిజిట‌ల్ రైట్స్ ను ఇత‌ర వీడియో సంస్థ‌ల‌కు అమ్మేస్తున్నారు. ఈ మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ప్ర‌తీ పెద్ద సినిమా రైట్స్ ను కోట్లు ఇచ్చి మ‌రీ కొంటున్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి సైరా డిజిట‌ల్ రైట్స్ ను మూడు భాష‌ల్లో క‌లిపి ఏకంగా 32 కోట్ల‌కు సొంతం చేసుకుంది. దీనివ‌ల్ల ఛానెల్స్ కు న‌ష్టం. కానీ నిర్మాత‌ల‌కు లాభం. ఇప్పుడు ఈ బిజినెస్ నిర్మాత‌ల‌కు మ‌రింత హెల్ప్ కానుంది.
ఓ సినిమాకు 32 కోట్లు ఇవ్వ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ సైరాకు ఇంత రేట్ ఇవ్వ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. ఇప్పుడు ఏ సినిమా విడుద‌లైనా కూడా మ్యాగ్జిమ‌మ్ నాలుగు నుంచి ఆరు వారాల త‌ర్వాత అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో ద‌ర్శ‌న‌మిచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు సైరా సినిమాను కూడా విడుద‌లైన ఆరు వారాలకే అమేజాన్ లో ఒరిజిన‌ల్ అప్ లోడ్ చేస్తాం అనే ఒప్పందంపైనే ఇంత భారీ మొత్తం ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. దీనికి ద‌ర్శ‌క నిర్మాత‌ల నుంచి కూడా ఓకే అనే డీల్ వ‌చ్చింది. చిరంజీవి లాంటి హీరో ఉన్న‌పుడు మూడు వారాల్లోనే క‌లెక్ష‌న్లు అన్నీ వ‌చ్చేస్తాయ‌ని న‌మ్ముతున్నారు యూనిట్. అందుకే ఆరు వారాలు అంటే ఎక్కువ టైమే. కానీ కొన్ని సినిమాలు 50 రోజుల వ‌ర‌కు కూడా థియేట‌ర్స్ లోనే ఆడుతుంటాయి. మ‌రీ ఆరు వారాల్లోనే ఒరిజిన‌ల్ విడుద‌ల చేస్తే చూడాల‌నుకున్న వాళ్లు ఆగి చూస్తారేమో..? అలా చేస్తే సినిమాల‌కు మంచిది కాదేమో అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి అమేజాన్, హాట్ స్టార్ మొద‌లుపెట్టిన ఈ బిజినెస్ ఛానెల్స్ కొంప ముంచేస్తాయో.. తేల్చేస్తాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here