సైరా రెండో షెడ్యూల్ కాదు.. ఇంకా మొద‌టిదే..!

Sye Raa
సైరా షూటింగ్ సైలెంట్ గా హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. అదేంటి చ‌డీ చప్పుడు లేకుండా చిరంజీవి సినిమా ఇలా మొద‌లైపోయింది అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న షెడ్యూల్ రెండోది కాదు.. ఇంకా తొలి షెడ్యూల్ అని తెలుస్తుంది. మొద‌టి షెడ్యూల్ లో సురేంద‌ర్ రెడ్డి తీసిన కొన్ని షాట్స్ చిరుకు న‌చ్చ‌లేదు. అందుకే రీ షూట్స్ చేయిస్తున్నాడు మెగాస్టార్. ఇప్పుడు అల్యూమీనియం ఫ్యాక్ట‌రీ స‌మీపంలోనే కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. మ‌రికొన్ని కీలక సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. మ‌రో రెండు మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. మార్చ్ 23 రెండో షెడ్యూల్ మొద‌లు కానుంది.
అప్ప‌ట్నుంచే అస‌లు ఆట కూడా షురూ కానుంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార కూడా పాల్గొనబోతున్నారు. సురేంద‌ర్ రెడ్డితో పాటు సైరా సెట్ లో కృష్ణ‌వంశీ కూడా ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలోని కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను తెర‌కెక్కించే బాధ్య‌త‌ను సురేంద‌ర్ రెడ్డి కాకుండా కృష్ణ‌వంశీకి ఇచ్చాడు మెగాస్టార్. రెండో షెడ్యూల్లో చిరు-న‌య‌న‌తారపై పాట చిత్రీక‌రించ‌నున్నారు. హైద‌రాబాద్ లోనే ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రంలో ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి గురువు అయిన గోసై వెంక‌న్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు అమితాబ్. ఇక విజ‌య్ సేతుప‌తి ఓబ‌య్య పాత్ర‌లో న‌టించ‌బో తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here