సైలెంట్ గా సైరా పూర్తి.. రెండో షెడ్యూల్ ఎప్పుడు..?

Sye Raa Narasimha Reddy second schedule
మొద‌లు పెట్ట‌నంత వ‌ర‌కే ఆ ఎదురుచూపులు.. ఒక్క‌సారి మొద‌లైన త‌ర్వాత ఎవ‌రి మాటా విన‌ట్లేదు మెగాస్టార్. ప్లానింగ్ ప్ర‌కారం అలా అలా వెళ్లిపో తున్నాడంతే. ఇప్పుడు సైరా షూటింగ్ కూడా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ మొత్తం 16 రోజులు జ‌రిగింది. డిసెంబ‌ర్ 6న మొద‌లైన ఈ షెడ్యూల్ 22న ముగిసింది. చిరంజీవితో పాటు బ్ర‌హ్మాజీ కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నాడు. అయితే మెయిన్ ఫోక‌స్ మాత్రం మెగాస్టార్ పైనే ఉంచాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.  హైద‌రాబాద్ లోని అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్ లో ఈ తొలి షెడ్యూల్ జ‌రిగింది. తొలి షెడ్యూల్ లో చిరుపై యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.
తొలి షెడ్యూల్ లో కేవ‌లం చిరు మాత్ర‌మే ఉన్నాడు. ఎవ‌రూ రాలేదు. అయితే రెండో షెడ్యూల్ నుంచి స్టార్స్ సంద‌డి క‌నిపించ‌నుంది. న‌య‌న‌తారతో పాటు మిగిలిన చిత్ర‌యూనిట్ కూడా రెండో షెడ్యూల్ లో సైరా సెట్ లో అడుగుపెట్ట‌నున్నారు. జ‌న‌వ‌రిలో ఈ షెడ్యూల్ మొద‌లు కానుంది. వ‌చ్చే షెడ్యూల్ లో జ‌గ‌ప‌తిబాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి సెట్ లో అడుగు పెట్ట‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్ రానున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు అమితాబ్ బ‌చ్చ‌న్. మ‌నం త‌ర్వాత ఆయ‌న న‌టిస్తున్న తెలుగు సినిమా ఇదే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొంద‌నున్న ఈ చిత్ర విష‌యంలో ఎక్క‌డా కాంప్రమైజ్ కావ‌ట్లేదు మెగా వార‌సుడు. సురేంద‌ర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన త‌ర్వాత కానీ రంగంలోకి దిగ‌లేదు. 2019 సంక్రాంతికి సైరా విడుద‌ల కానుంది. 200 కోట్లు ఈ చిత్రానికి ప్రాథ‌మిక బ‌డ్జెట్ గా నిర్ణ‌యించారు. అది పెరిగినా ఆశ్చ‌ర్య పడాల్సిన ప‌నిలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here