సౌత్ హీరోయిన్ల‌కు ఇక ప‌ట్టించుకోరా..?

KAJAL TAAPSEE SHRUTHI HASAN ILEANA NO OFFERS IN BOLLYWOOD
ఎంత చేసినా.. ఏం చేసినా.. సౌత్ గ్రేట్ అని మాత్రం ఒప్పుకోవ‌ట్లేదు బాలీవుడ్. ఇంకా ఇక్క‌డి సినిమాల‌పై వాళ్ల‌కు చిన్న‌చూపు పోలేదు. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో ఈ ప‌క్ష‌పాత వైఖ‌రి మార్చుకోవ‌ట్లేదు బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు తెలుగు సినిమాల‌ను అక్క‌డి ద‌ర్శ‌క నిర్మాత‌లు నెత్తిన పెట్టుకుంటున్నారు. కానీ హీరోయిన్ల విష‌యంలో మాత్రం చిన్న‌చూపు కొనసాగుతుంది. ఒక‌ప్పుడు శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద లాంటి ముద్దుగుమ్మ‌లు బాలీవుడ్ లోనూ జెండా పాతారు. వాళ్లు ఇక్క‌డినుంచి వెళ్లిన వాళ్లే. ఇప్పుడు కూడా అక్క‌డ విద్యాబాల‌న్, దీపిక ప‌దుకొనే లాంటి ద‌క్షిణాది భామ‌లు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ద‌క్షిణాది నుంచి వ‌చ్చిన ముద్దుగుమ్మ‌ల‌ను బాలీవుడ్ లో అస్స‌లు ప‌ట్టించుకోవ‌ట్లేదు. విజ‌యాలు ఉన్నా కూడా అసిన్, కాజ‌ల్, శృతిహాస‌న్, ఇలియానా లాంటి హీరోయిన్ల‌కు బాలీవుడ్ లో ఆఫ‌ర్లు లేవు. సౌత్ లో టాప్ చైర్ వ‌దిలేసి బాలీవుడ్ క‌ల‌లు కంటూ వీళ్ళంతా ముంబై ట్రైన్ ఎక్కారు. కానీ అక్క‌డ క‌ల‌లు క‌ల్ల‌లుగానే మిగిలిపోయాయి.
ఇప్పుడు వీళ్ల జాబితాలోకే తాప్సీ కూడా చేరిపోయింది. ఈ భామ‌కు కూడా బాలీవుడ్ లో చాలా విజ‌యాలున్నాయి. బేబీ.. ఛ‌ష్మే బ‌ద్ధూర్.. పింక్.. నామ్ ష‌బానా.. జుడ్వా 2.. ఇలా చాలా సినిమాలు చేసింది తాప్సీ. ఇందులో నామ్ ష‌బానా మిన‌హా అన్నీ విజ‌యాలే. నామ్ ష‌బానాకు కూడా మంచి మార్కులు ప‌డ్డాయి. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న హీరోయిన్ ను ఏ ఇండ‌స్ట్రీ అయినా నెత్తిన పెట్టుకుంటుంది. కానీ తాప్సీకి మాత్రం బాలీవుడ్ లో అవ‌కాశాలు లేవు. దానికి కార‌ణం ఆమె సౌత్ నుంచి రావ‌డ‌మే. గ‌తంలోనూ చాలా మంది సౌత్ నుంచి వ‌చ్చిన హీరోయిన్ల‌కు వ‌ర‌స విజ‌యాలు వ‌చ్చినా కూడా స్టార్ హీరోలెవ‌రూ ఆఫ‌ర్లు ఇవ్వ‌లేదు. ఈమెకు ముందు అసిన్.. కాజ‌ల్.. ఇలియానా లాంటి ముద్దుగుమ్మ‌ల‌కు కూడా అక్క‌డ ట్రాక్ రికార్డ్ అదిరిపోయేలా ఉన్నా స్టార్ హీరోయిన్లు మాత్రం కాలేదు. దీన్నిబ‌ట్టి అక్క‌డున్న హీరోయిన్ల‌ను మిన‌హా.. ఇక్క‌డి నుంచి అక్క‌డికి వెళ్లిన హీరోయిన్ ల‌ను ఉత్త‌రాది ద‌ర్శక నిర్మాత‌లు ప‌ట్టించుకోరు అనే విష‌యం అర్థ‌మైపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here