స్కూల్ రూమ్ లో విద్యార్థులు ఎందుకు ఇలా చేసారు?


బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఓ జంట కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వాలు వెతుకుతుంది దొంగల కోసమో లేక హంతకులు కోసమా కాదు స్కూల్ విద్యార్థులు కోసము.తరగతి గదిలో ఓ విద్యార్థిని మెడలో తాళి కడుతున్న బాలుడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. 29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని ‘అమ్మా’ అంటూ మొబైల్‌ వైపు చూస్తాడు. ఆ సమయంలో ‘తాళి కట్టరా’ అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తోంది. వెంటనే యూనిఫాం ధరించి ఉన్న బాలిక మెడలో బాలుడు తాళి కట్టాడు. అయితే బాలిక ముఖం స్పష్టంగా కనిపించకుండా వీడియో చిత్రీకరించారు. ఆ జంట ఎవరన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్ధులకి ఇలాంటి పని చేయడానికి ఎం ప్రేరేపించిందో తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here